Begin typing your search above and press return to search.
వ్యాయామ సమయంలో గుండెపోటులకు కారణం?
By: Tupaki Desk | 23 Dec 2021 11:30 PM GMTమనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. మనసు ప్రశాంతంగా ఉండాలంటే.. మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. తిన్నది ఒంటికి సరిగా ఒంటబట్టాలంటే.. వ్యాయామం ఒక్కటే మార్గం. అందుకే వైద్యులు వారంలో కనీసం ఐదు రోజులైనా శారీరక శ్రమ చేయాలంటారు. పని దినాల్లో వీలు కాకుంటే కనీసం వారాంతాల్లో అయినా ఒళ్లు వంచాలని చెబుతుంటారు. ఇక చెమట పట్టేంత వరకు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. ప్రస్తుతం మారిన జీవన శైలితో ప్రజలు వ్యాయామానికి దూరమయ్యారు.
ఫలితంగా చిన్నవయస్సులోనే జబ్బుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాయామం అలవాటుగా చేసుకోవటం మంచిదన్న అభిప్రాయం వైద్యనిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. నిత్య వ్యాయామాల కారణంగా గుండె, మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణకోశ గ్రంధులు, కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి.
జాగ్రత్తలు తప్పనిసరి..
ఎంత ఆరోగ్యానికి మేలు చేసినా.. వ్యాయామాల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. వ్యాయామాలను చిన్నగా మొదలు పెట్టి నెమ్మదిగా అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళాలి. చాలా మంది అలా కాకుండా తాము పెట్టుకున్న లక్ష్యాన్ని వెంటనే చేరి పోవాలన్న ఆతృతతో ప్రారంభించన రోజునే అతిగా చేస్తూ కోరి కష్టాలు కొని తెచ్చుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల శరీరం ఒత్తిడికి లోనై చివరికి గుండెపై భారం పడి సమస్యలు తలెత్తుతాయి.
పరిమితికి మించకుంటే..
అంటే.. శక్తి సామర్థ్యాల పరిమితికి మించకుండా చేస్తే వ్యాయామం ఆరోగ్యకరమే. ఎప్పుడైతే ఆ పరిమితి మీరామో.. అతిగా వ్యాయామం చేశామో గుండెపై ఒత్తిడి పడుతుంది. అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టుకు అనంతరం మరణానికి దారితీస్తుంది. నిజానికి, మన దేశంలోనే కాదు.. కార్డియాక్ అరెస్టులు, కార్డియో వాస్కులర్ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య. ఇది ఎప్పటినుంచో ఉన్నప్పటికీ. ఇటీవలి కాలంలో యువతలో అకాల మరణాలు పెరిగాయి. దీనిపై వైద్యులు, వైద్య నిపుణులు సరైన పరిష్కారం వెదికే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని కారకాలను గుర్తించారు.
కొన్ని కారకాలను బట్టి..
వ్యాయామ సమయంలో గుండెపోట్లు రావటం అనేది అప్పటి శారీరక పరిస్థితి, ఆరోగ్యం, ఇతరత్రా సమస్యలను బట్టి ఆధారపడి ఉంటుంది. కొందరు అంతకుముందు రోజు మద్యం ఎక్కువగా తాగి ఉండొచ్చు. విపరీతమైన ఒత్తిడికి గురై ఉండొచ్చు. రాత్రిపూట సరిగా నిద్రపోయి ఉండకపోవచ్చు. దీంతో మర్నాడు శరీరం వ్యాయామానికి సహకరించకపోవచ్చు. అయినా కూడా వీటిని పట్టించుకోకుండా ఎప్పటి మాదిరిగానే వ్యాయామాలకు ఉపక్రమిండం విపరిణామాలకు దారితీస్తుంది.
అనుకోని ప్రభావం
ముఖ్యంగా వారాంతాల్లో జిమ్‌లకు వెళ్లేవారు ఎట్టి పరిస్థితుల్లోనైనా వ్యాయామం చేయాలనే ఉద్దేశంతో పట్టుబట్టి చేస్తుంటారు. ఇది శరీరం, అవయవాల మీద విపరీత ప్రభావం చూపిస్తుంది. పైగా కొందరికి అప్పటికే తెలియకుండా గుండె సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉండి ఉండొచ్చు. పుట్టుకతో వచ్చే కొన్ని గుండె సమస్యలున్నా పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అసలు అలాంటి సమస్య ఉన్న సంగతైనా తెలియదు.
అధిక రక్తపోటు, మధుమేహంలోనూ తప్పనిసరిగా లక్షణాలు కనిపించాల్సిన అవసరం లేదు. వీటిని గుర్తించటానికి ముందుగా పరీక్షలు చేసుకునేవారు చాలా తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల వ్యాయామాలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెలోని విద్యుత్ వ్యవస్థ విపరీతంగా ప్రభావితమై హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. శ్వాస వేగం గణనీయంగా పెరిగి, ఆయాసంతో చివరికి శ్వాస తీసుకోలేని పరిస్థితి తలెత్తొచ్చు. గుండె పోటుకు గురై కుప్పకూలిపోతుండటం జరుగుతుంది. రక్తనాళాల్లో పీడనం బాగా పెరిగి పక్షవాతానికి దారితీయొచ్చు.
సమస్య అరుదే... కానీ సమస్య పెద్దది
వ్యాయామం చేస్తూ కుప్పకూలడం.. లేదా తీవ్ర అస్వస్థతకు గురికావడం వంటి ఘటనలు చాలా అరుదే. జరిగిన ఒకటీ రెండు ఘటనలు కూడా వ్యాయామం సందర్భాల్లోనివి కావడంతో ఎక్కువ చర్చకు వస్తోంది. అయినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎవరికైనా మంచిదే. మనమేమీ పోటీలకు వెళ్లటం లేదనే సంగతి గుర్తుంచుకోవాలి. శరీరాన్ని విపరీతమైన ఒత్తిడికి గురిచేసి క్షణాల్లో లక్ష్యాలను చేరుకోవటం అసాధ్యమని తెలుసుకోవాలి. గుండెపోటుకు వ్యాయామం ప్రత్యక్ష కారణం కాదు.
ఇది హఠాత్తుగా సంభవించేదీ కాదు. శరీరం సహకరించకపోతున్నా కూడా బలవంతగా, అతిగా భారీ కసరత్తులు చేయటమే ముప్పు తెచ్చిపెడుతుంది. శరీరం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. వీటిని గుర్తించి, జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం. నోరు ఎండిపోవటం, శరీరం కాస్త చల్లగా అవటం, తల తేలిపోతున్నట్టు అనిపించటం, తీవ్రమైన ఆయాసం, గుండె దడ, బలహీనంగా ఉన్న శరీర భాగాలు వణకటం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే వ్యాయామం నిలిపివేసి కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవటం అనంతరం వైద్యుని సంప్రదించి తగిన చికిత్స పొందటం మేలు.
యువకులైనా గుండె చెకప్ చేయించుకోవాలి
చాలామంది యువత తమ గుండె పనితీరు ఎలా ఉందో చెక్ చేయించుకోకుండానే జిమ్ లకు వెళ్తుంటారు. అంతేకాక జిమ్ సందర్భంగా వెయిట్ ట్రయినింగ్ చేస్తుంటారు. ఇది గుండె పనితీరును చిక్కబరుస్తుంది. కొందరు కండల కోసమో మరోదానికో సప్లిమెంట్ లు తీసుకుంటారు. ఇవి గుండె కు మంచివి కాదు. మరింత చేటు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు కార్డియో వాస్కులర్ వ్యాధులు ఎక్కువ శాతం ఒత్తిడి, యాంగ్జయిటీ కూడా ఎక్కువ కారణం. వీటిని ఎంత తగ్గించుకుంటే అంత మేలు.