Begin typing your search above and press return to search.

యువ‌గ‌ళంలో.. ఈ స‌మ‌స్య‌లేంటి..?

By:  Tupaki Desk   |   1 Feb 2023 6:00 AM GMT
యువ‌గ‌ళంలో.. ఈ స‌మ‌స్య‌లేంటి..?
X
యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేస్తున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీమంత్రి నారా లోకేష్‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య‌మైన మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. అయితే.. ఈ క్ర‌మం లో కొన్ని అనూహ్య‌మైన ఘ‌ట‌న‌లు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తెలుసుకు నే క్ర‌మంలో కొన్ని కొన్ని పంటికింద‌రాళ్ల మాదిరిగా త‌గులుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో నారా లోకేష్ స‌హ‌నంతో వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది వాస్త‌వం.

కానీ, నారా లోకేష్ మాత్రం స‌హ‌నాన్ని కోల్పోతున్నారని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల సొంత పార్టీ నేత ఒక‌రు కుప్పంలోని శాంతిపురంలో మాట్లాడుతూ.. పార్టీ ప‌రిస్థితి పైకి ఉన్న‌ట్టుగా లేద‌ని చెప్పారు. గ్రౌండ్ లెవిల్లో.. కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాదాన్యం ద‌క్క‌డం లేద‌ని వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను కూడా ఆయ‌న వెల్ల‌డించారు. అయితే.. ఈ విష‌యంలో కొంత సంయ‌మ‌నం పాటించాల్సిన లోకేష్ దురుసుగా వ్య‌వ‌హ‌రించారు.

నీకు ఎవ‌రు చెప్పారు. గ్రౌండ్ రిపోర్టు గురించినీకెందుకు? అని వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో అక్క‌డే ఇలా మాట్లాడితే ఎలా? అంటూ.. స‌ద‌రు వ్య‌క్తిని మంద‌లించారు. ఇక‌, కుప్పం ప‌ర్య‌ట‌న ముగింపులో కూర గాయ‌ల దుకాణంలో వినియోగ‌దారుల‌ను క‌లుసుకున్నారు. ఈసంద‌ర్భంగా కూర‌ల ధ‌ర‌ల‌పై మాట్లాడారు. ఈ క్ర‌మంలో రైతు బ‌జార్లు తెచ్చిందే త‌మ ప్ర‌భుత్వ‌మ‌ని.. చంద్ర‌బాబు విజ‌న్‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని వ్యాఖ్యానించారు.

అయితే.. ఇదే స‌మ‌యంలో ఒక మ‌హిళ‌.. గ‌తం క‌న్నా.. ఇప్పుడు రైతు బ‌జార్ల‌లో త‌క్కువ ధ‌ర‌కే కూర‌లు విక్ర‌యిస్తున్నార‌ని.. సీఎం జ‌గ‌న్ పాల‌న బాగుంద‌ని చెప్పింది. అంతే.. నారా లోకేష్ ఒక్క‌సారిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీకు సాక్షి బాగా వ‌స పోసిందే.. అనివ్యాఖ్యానించారు. అయితే.. ఇలాంటి సంద‌ర్భాలు పాద‌యాత్ర‌లో కామ‌న్‌. మంచిని, చెడును కూడా త‌ట్టుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. లేక‌పోతే.. ఇంత చేసినా.. ప్ర‌యోజ‌నం మాత్రం క‌నిపించ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.