Begin typing your search above and press return to search.

దేవుడి దగ్గరకు వెళ్లి ఈ ఈగోలేంది గుడివాడ?

By:  Tupaki Desk   |   27 March 2023 5:01 PM GMT
దేవుడి దగ్గరకు వెళ్లి ఈ ఈగోలేంది గుడివాడ?
X
కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని ఘటనలు జరిగిపోతుంటాయి. ఇలాంటి వేళలో అనవసరమైన ఈగోల కు పోయి.. ఆగ్రహావేశాల్ని ప్రదర్శించటం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువ గా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విషయంలో చోటు చేసుకుంది. తనను వెయిట్ చేయించారన్న కోపంతో ఊగిపోయిన ఆయన.. బదిలీ వేటు వేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. దేవుడి దర్శనం కోసం వెళ్లి.. వెయిట్ చేయటంలో అధికారుల మీద తప్పు నెట్టేసిన మంత్రివర్యులు.. అందుకు ఇద్దరు అధికారుల పై బదిలీ వేటు వేసి కసి తీర్చుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

ఇటీవల అనకాపల్లిలోని నూకాలమ్మ దేవాలయంలో జాతర మొదలైంది. తొలి రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ టెంపుల కు వచ్చారు. ఆ సమయంలో అమ్మవారి కి నైవేధ్యం ఇస్తున్నారు. దీంతో.. ఆయన వెయిట్ చేయక తప్పలేదు. మంత్రి హోదాలో ఉండి.. దర్శనం కోసం వచ్చి 45 నిమిషాలు వెయిట్ చేయాల్సిన వచ్చింది. తానువస్తున్నప్పుడు అమ్మవారికి నైవేధ్యం ఎప్పుడు పెడతారో చెప్పాలి కదా? ఆ మాత్రం సమాచారం ఇవ్వరా? అంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తాజాగా దేవాలయ ఇన్ ఛార్జి అధికారి బుద్ధ నగేష్ తో పాటు అనకాపల్లి నూకాలమ్మ దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి చంద్రశేఖర్ లు ఇద్దరిని బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వేరే అధికారులకు ఆలయ బాధ్యతల్ని అప్పజెప్పారు. మంత్రివారు ఎప్పుడు వచ్చేది ముందుగానే చెప్పి ఉంటే.. ఆయనకు అసౌకర్యం కలగకుండా చూసే వాళ్లమని.. అదేమీ చెప్పకుండా వచ్చేయటం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందంటున్నారు.కారణం ఏమైనా.. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన మంత్రివారు వెయిటింగ్ చేయాల్సిన రావటం.. బదిలీ వేటు పడటం మాత్రం చర్చనీయాంశంగా మారింది. దేవుడి దర్శనం కోసం వెళ్లినప్పుడు ఇలాంటి ఈగోలు చూపించాల్సిన అవసరం ఉందా? అంటూ గుడివాడపై ప్రశ్నలు కురిపిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.