Begin typing your search above and press return to search.
సీఎం వైఎస్ జగన్ సూక్తి ముక్తావళి.. విని తీరాల్సిందే
By: Tupaki Desk | 21 Oct 2022 4:13 AM GMTఏపీ రాజకీయాల్లో బూతుల పంచాంగం మొదలైంది ఎప్పటి నుంచి? ఎవరి నుంచి? నోరు విప్పితే బూతులు తప్పించి.. మరొక మాట రాని నేతలు ఎక్కువగా ఉండే పార్టీగా ఏపీ అధికార పక్షం వైసీపీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
నోటితో పలకలేని.. చేతులతో రాయలేని భాషను ఉపయోగించే పార్టీ నేతల్ని ఒక్కసారంటే ఒక్కసారిగా కూడా అదుపు చేయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో తన సూక్తి ముక్తావళిని వినిపించటంఆసక్తికరంగా మారింది.
అయ్యయ్యో.. ఎంత మాట.. ఎంత మాట? ఇలాంటి మాటలు సభ్య సమాజంలో బతికే వారి నోటి నుంచి రావటమా? చెప్పును చేతితో పట్టుకొని చూపించటమా? ఎంతటి దారుణం? మరెంత దయనీయం? అంటూ ఆయన ఫీలైన వైనాన్ని చూసినప్పుడు విస్మయానికి గురి కావాల్సిందే. అదే సమయంలో ఆయన నోటి నుంచి వచ్చిన సూక్తి ముక్తావళి మాటల్ని విని తీరాల్సిందే.
తిట్ల రాజకీయాల నుంచి ఏపీ రాజకీయాన్ని బూతులతో నింపేసిన తమ పార్టీ నేతల గురించి కనీస ప్రస్తావన తీసుకురాని సీఎం జగన్.. అందుకు భిన్నంగా.. ''కొడకల్లారా'' అన్న మాటను తప్పించి మరే ఘాటు మాటను వాడని పవన్ మీదా.. ఆయన పార్టీ మీదా.. ఎప్పటిలానే ఆయన వ్యక్తిగత విషయాల మీద విరుచుకుపడిన వైనం చూసినప్పుడు.. జగన్ మాటలకు చేతలకు మధ్య తేడా ఇట్టే అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది.
అవనిగడ్డలో నిర్వహించిన సభలో అదే పనిగా నీతులు.. విలువలను వల్లించిన జగన్ మాటల్ని విని తీరాల్సిందే. ఆయన చెప్పిన మాటల్లో అన్నింటికంటే హైలెట్ మాట ఒకటి ఉంది. అదేమంటే..''సామాజిక న్యాయం చేసే వారికి.. సమాజాన్ని ముక్కలు చేసే వారికి మధ్య యుద్ధమిది'' అన్న ఆయన మాటల్ని చూసినప్పుడు వాస్తవం ఏమిటో ఇట్టే అర్థం కాక మానదు.
తనకు అలవాటైన దత్త పుత్రుడి మాటలకు.. దత్త తండ్రి అన్న మాటను అదనంగా చేర్చిన ఆయన.. రానున్న రోజుల్లో ఈ పదాన్ని మరింత ఎక్కువగా వాడే అవకాశం ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి.
ఇక.. సీఎం నోటి నుంచి వచ్చిన సూక్తి ముక్తావళిలో హైలెట్ లాంటి వ్యాఖ్యల్ని చూస్తే..
- వాళ్లు చేసిన మంచేమిటో చెప్పుకోలేరు. ప్రజలు వాళ్లని నమ్మడం లేదు. అందుకే వారు బూతులు మాట్లాడుతున్నారు. చెప్పులు చూపుతు న్నారు.
- తిట్లలో వీధి రౌడీలను మించిపోయారు. వీధి రౌడీలు కూడా అటువంటి మాటలు మాట్లాడతారో లేదో నాకు తెలియదు
- సామాజిక న్యాయం చేస్తున్న వారికీ, సమాజాన్ని ముక్కలు, చెక్కలుగా చేయాలనుకునే వారికీ మధ్య యుద్ధం ప్రారంభమైంది.
- ఇది పేదవాడికి..పెత్తందారులకు మధ్య యుద్ధం. ఇందులో కుట్రలు, కుతంత్రాలు రాబోయే రోజుల్లో మరింతగా కనిపిస్తాయి. వాటిని నమ్మవద్దు.
- వారి మాదిరిగా నాకు అన్ని టీవీ చానళ్లు, పేపర్లు లేవు. హంగూ ఆర్భాటాలు లేవు. దుష్టచతుష్టయానికి చెందిన టీవీ చానల్స్‌ను చూడొద్దు. పత్రికలను చదవవద్దు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

— Rambabu.katika Ram (@ram_katika) October 20, 2022