Begin typing your search above and press return to search.

చట్టంలో మార్పులకు మోడీ సర్కారు ప్రతిపాదనలు ఏమిటి?

By:  Tupaki Desk   |   10 Dec 2020 4:18 AM GMT
చట్టంలో మార్పులకు మోడీ సర్కారు ప్రతిపాదనలు ఏమిటి?
X
వణికించే చలి. దానికి తోడు కరోనా మహమ్మారి పొంచి ఉన్న వేళలో ప్రాణాల్ని పణంగా పెట్టి.. తమ డిమాండ్ల సాధన కోసం రోడ్ల మీదకు వచ్చారు పంజాబ్ రైతులు. మోడీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవాలన్న సింగిల్ డిమాండ్ పై ఢిల్లీ సరిహద్దుల్లో నిర్వహిస్తున్న నిరసనలు.. ఇప్పటికి పదమూడు రోజులకు చేరుకున్నాయి. దేశ చరిత్రలో అన్నదాతలు రోడ్డెక్కటం.. రోజుల తరబడి నిరసనలు నిర్వహించటం కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడిని పెంచుతోంది. అవసరమైతే.. రెండు.. మూడు నెలల వరకు నిరసనలు చేయటానికి సైతం తాము సిద్ధమని రైతులు చెబుతున్నారు.

ఇలాంటివేళ.. రైతు సంఘాల ప్రతినిధుల ముందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనల్ని తీసుకొచ్చింది. అందులోని అంశాల్ని వారు రిజెక్టు చేశారు. ఇంతకీ కేంద్రం వారి ముందు ఉంచిన ప్రతిపాదనలు ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. అవేమంటే..

- ప్రస్తుత కనీస మద్దతు ధర విధానాన్ని కొనసాగిస్తాం. రాతపూర్వక హామీ ఇస్తాం

- వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలను బలహీనపర్చం

- ప్రైవేటు మండీలు.. ప్రైవేటు వ్యాపారులకూ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తాం

- ప్రైవేటు వ్యాపారులపై కూడా ఏపీఎంసీల్లో రైతులు చెల్లించే మాదిరే పన్నులూ.. సెస్సులూ కట్టేట్లు చేస్తాం. రాష్ట్రాల అధీనంలో ఈ ఏపీఎంసీలు నడుస్తాయి.

- వ్యాపారులకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు చేసేలా రాష్ట్రాలకు అధికారాలు కల్పించటం కారణంగా రైతుల్ని మోసగించే అవకాశం ఉండదు

- ఒప్పంద సేద్యంలో వివాదాలు తలెత్తితే.. వాటి పరిష్కారానికి రైతులుసివిల్ కోర్టుల్ని ఆశ్రయించే వీలు కల్పిస్తాం

- కొత్త చట్టంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టులో జరగాలన్న రూల్ ను సవరించటానికి సిద్ధం

- ఒప్పంద సేద్యం కుదుర్చుకున్న సంస్థ లేదంటే వ్యక్తులు.. రైతులకు చెందిన వ్యవసాయ భూమిని తనఖా పెట్టటానికి వీల్లేకుండా.. దానిపై రుణం తీసుకునే అవకాశం ఇవ్వకుండా సవరణ చేస్తాం.

- రైతుల భూముల్ని కార్పొరేట్లు కబ్జా చేూస్తారన్న భయం రైతులకు లేకుండా చట్టంలో మార్పులు తీసుకొస్తాం

- రైతులకు చెందిన వ్యవసాయ భూమిలో వ్యాపారులు లేదంటే ఒప్పంద సంస్థలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా వాటిని తనఖా పెట్టటానికి వీల్లేని రీతిలో.. వాటిపై రుణాలు పొందే అవకాశం లేకుండా ఉండేలా నిబంధనల్ని తీసుకొస్తాం.

- వ్యవసాయ విద్యుత్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఇప్పటివరకుఅమలవుతున్న విధానాన్నే కొనసాగించటం.

- పంట కోతల తర్వాత గడ్డి దుబ్బల దహనానికి పాల్పడితే.. ఫైన్ వేస్తామంటూ కొత్త చట్టంలో తెచ్చిన నిబంధనను మారుస్తాం. రైతులు చెప్పినట్లుగా సవరణలు చేస్తాం.