Begin typing your search above and press return to search.

మూడు రాజధానులు.. ఎందుకు లాభం?

By:  Tupaki Desk   |   19 Dec 2019 7:56 AM GMT
మూడు రాజధానులు.. ఎందుకు లాభం?
X
ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన తర్వాత ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు ఉండగా లేనిది మనకెందుకు వద్దు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూ జగన్ స్పష్టం చేశారు. దీనిపై ఇప్పుడు అంతటా చర్చలు జరుగుతున్నాయి.

సీమ ప్రజలు తమకు హైకోర్టు కావాలంటున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రవారు తమను అభివృద్ధి చేయాలంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ.. ప్రాంతీయ అసమానతలను పారదోలుతూ అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి బహుళ రాజధానుల వ్యవస్థ మూలస్తంభంగా నిలుస్తుందని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిరూపితమైంది.

ఉమ్మడి ఏపీలో మొత్తం అధికారాలు హైదరాబాద్ లోనే కేంద్రీకరించడంతో విభజనలో ఏపీకి అన్యాయం జరిగింది. అందుకే మరోసారి ఏపికి అన్యాయం జరగకుండా జగన్ చేసిన ఈ మూడు రాజధానుల సిఫార్సుపై చర్చ జరుగుతోంది.

ఇక ఇప్పటికే ఏపీ రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి అన్ని వర్గాల ప్రజలు, నిపుణులు , మేధావుల నుంచి శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. ఈ ప్రధాన సిఫార్సులు చర్చనీయాంశమయ్యాయి. ఆయన సిఫార్సులు ఇవీ..

*ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు
*రాష్ట్రంలో రాజధానిని వికేంద్రీకరించాలి.
* అధికార వికేంద్రీకరణతోపాటు ప్రభుత్వ వ్యవస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి
*శాసనసభ,సచివాలయం, హైకోర్టులను వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి
* విజయవాడ– గుంటూరు నగరాల మధ్య ప్రాంతాన్ని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి (చంద్రబాబు) చెప్పారు. కానీ ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ కోణంలో ఆ రెండు నగరాల మధ్య మెగా సిటీని విస్తరించడం ఆచరణ సాధ్యం కాదు.
* ఉత్తరాంధ్ర, రాయలసీమలలో ప్రభుత్వ అధికార వ్యవస్థలను విస్తరించాలి.
* విజయవాడ – గుంటూరు మధ్య రాజధానిని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. దాంతోపాటు దేశంలో వరి ఉత్పత్తికి ప్రధానంగా దోహదపడుతున్న సారవంతమైన పంట పోలాలు నాశనమవుతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.
– విజయవాడ – గుంటూరు మధ్య భూగర్భ జల మట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప క్షేత్రం కూడా. ఆ ప్రాంతంలో నేల స్వభావం రీత్యా అక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు.
– అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి.


* శివరామకృష్ణన్ కమిటీ ఉదాహరణలు

* ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన యూరప్ దేశం నెదర్లాండ్ లో రెండు రాజధానులు ఉన్నాయి. ఉత్తరాన అమస్టర్ డామ్, దక్షిణాన హేగ్ నగరాల్లో పార్లమెంట్, సచివాలయం వేరువేరుగా ఉంది.

* మలేషియా దేశంలోనూ రెండు రాజధానులున్నాయి. కౌలంలంపూర్, పుత్రజయ.

*ఇక చిలీ, శ్రీలంక, యెమన్, టాంజానియా, బొలీవియా, బరుండీ, చెక్ రిపబ్లిక్, హండూరస్, ఇస్వటినీ,
మాంటెనెగ్రో , పశ్చిమ సహారా, కోట్ డివోర్ దేశాల్లో రెండేసి రాజధానులున్నాయి.