Begin typing your search above and press return to search.

వాట్ యాన్ ఇంట‌లిజెంట్ మోడీజీ.. రాష్ట్రాల‌ను ఇరికించారా?

By:  Tupaki Desk   |   19 May 2021 2:30 PM GMT
వాట్ యాన్ ఇంట‌లిజెంట్ మోడీజీ.. రాష్ట్రాల‌ను ఇరికించారా?
X
ప్ర‌పంచంలో ఏ దేశం మీద కూడా చేయ‌నంత దాడిని.. భార‌త్ పై కొన‌సాగిస్తోంది క‌రోనా సెకండ్ వేవ్‌. ఒక రోజు నమోదైన కేసుల సంఖ్య గ‌రిష్టంగా 4 ల‌క్ష‌లకు చేరింది. రోజూవారి మ‌ర‌ణాలు కూడా గ‌రిష్టంగా 4 వేలు దాటాయి. ఇదంతా.. న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వ‌ నిర్ల‌క్ష్యం వ‌ల్లనే అనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. విప‌క్షాలు కాకుండా.. న్యాయ‌స్థానాలు, ప‌లు రంగాల నిపుణులు కూడా ప్ర‌ధాని నిర్ల‌క్ష్యాన్ని బ‌హిరంగంగా ఎత్తిచూపారు. సెకండ్ వేవ్ గురించి తాము హెచ్చ‌రించినా ప‌ట్టించుకోలేద‌ని సూటిగా నిల‌దీశారు.

ఇక‌, అంత‌ర్జాతీయ మీడియా ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ప‌రిస్థితి ఇదేవిధంగా కొన‌సాగితే.. ఈ ఏడాది ఆగ‌స్టు నాటికి భార‌త్ లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 10 ల‌క్ష‌ల‌కు చేరుకుంటాయ‌ని ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవ‌ల్యూయేష‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇదిగ‌న‌క జ‌రిగితే.. అందుకు దేశ ప్ర‌ధానిగా మోడీనే బాధ్యుడు అవుతార‌ని ప్ర‌ఖ్యాత లాన్సెట్ జ‌ర్న‌ల్‌ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించింది. ఇక‌, దేశంలో విప‌క్షాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా దేశంలో వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా డిమాండ్ కు స‌రిప‌డా లేద‌ని రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి. తెలంగాణ‌లో కొవాగ్జిన్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ ను నిలిపేస్తూ రాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. కేంద్రం నుంచి వ్యాక్సిన్ రాక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని ప్ర‌క‌టించింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని స‌మాచారం. ఇవాళ (బుధ‌వారం) కొవిడ్ సౌక‌ర్యాల‌పై ఏపీ హైకోర్టులో జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా.. త‌మ‌కు కావాల్సినంత ఆక్సీజ‌న్ కూడా ఇవ్వ‌ట్లేద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అటు వ్యాక్సిన్‌, ఇటు ఆక్సీజ‌న్ కూడా దేశంలో స‌రిప‌డా లేద‌నడానికి ఈ రెండు సంఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.

అయితే.. ఇంత జ‌రుగుతున్నా మోడీ సైలెంట్ గా ఉండ‌డానికి రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఎలాగో ప‌డాల్సిన నింద‌ల‌న్నీ ప‌డ్డామ‌ని, ఇక డ‌బ్బులు కూడా ఎందుకు వేస్టు చేసుకోవాల‌ని చూస్తున్నార‌ని అంటున్నారు. అందువ‌ల్లే వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా విష‌యాన్ని రాష్ట్రాల మీద‌కు నెట్టేశార‌ని బీజేపీ వ్య‌తిరేకులు ఆరోపిస్తున్నారు. లాక్ డౌన్ తోపాటు, వ్యాక్సిన్ కొనుగోళ్లు ఎవ‌రివి వారే చూసుకోవాల‌ని కేంద్రం చెప్ప‌డంలో ఉద్దేశం ఇదేన‌ని చెబుతున్నారు.

ఇక‌, రెండో కార‌ణం ఏమంటే.. రాష్ట్రాలు మొత్తం వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయ‌డం అనేది పెద్ద టాస్క్. ప‌లు రాష్ట్రాలు గ్లోబ‌ల్ టెండ‌ర్లు అనే మాట ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. దానికి సంబంధించిన ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు వెళ్లాయో ఎవ్వ‌రికీ తెలియ‌దు. చాలా రాష్ట్రాలు కేంద్రం నుంచే వ్యాక్సిన్ రావాల‌ని చూస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో రాష్ట్రాలు వ్యాక్సిన్ విష‌యంలో విఫ‌ల‌మైతే.. ఆయా ముఖ్య‌మంత్రులపై నింద‌లు ప‌డ‌తాయ‌ని, ఆ త‌ర్వాత పోయిన ఇమేజ్ ను తిరిగి ద‌క్కించుకోవాల‌ని మోడీ చూస్తున్నార‌ని వారు అంటున్నారు. పోయిన ప్ర‌తిష్ట రాకున్నా.. క‌నీసం తీవ్ర‌తైనా త‌గ్గుతుంది కదా అని అనుకుంటున్నార‌ట‌.