Begin typing your search above and press return to search.

రగిలిపోతున్న కొల్హాపూర్.. అసలేమైంది?

By:  Tupaki Desk   |   7 Jun 2023 8:46 PM GMT
రగిలిపోతున్న కొల్హాపూర్.. అసలేమైంది?
X
వాట్సాప్ స్టేటస్ ప్రభావం తో మహారాష్ట్ర లోని కొల్హాపూర్ ను రణరంగంగా మార్చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఒక వర్గం.. అందుకు భిన్నంగా ఔరంగజేబ్ ను మరో వర్గం కీర్తిస్తూ పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ ల దెబ్బకు పరిస్థితి పూర్తిగా అదుపు తప్పటమే కాదు..తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఔరంగజేబు.. టిప్పు సుల్తాన్ లను కీర్తిస్తూ కొందరు తమ వాట్సాప్ స్టేటస్ లో పొగుడుతూ సందేశాల్ని పెట్టారు. దీనికి స్పందించిన హిందూ సంస్థలు.. భారీ నిరసన ను చేపట్టారు. ఈ క్రమం లో కొల్హాపూర్ బంద్ నకు పిలుపునిచ్చాయి హిందూ సంస్థలు.

ఈ బంద్ ను పోలీసులు అడ్డుకునేందు కు ప్రయత్నిచంటంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తమ దీంతఆందోళన ను పోలీసులు అడ్డుకోవటం పై హిందూ సంస్థల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. అక్కడి దుకాణాలు.. వాహనాల్ని ధ్వంసం చేయటంతో పాటు.. వాటి కి నిప్పు పెట్టారు. దీంతో.. నిరసన కాస్తా హింసాత్మకంగా మారింది.

చూస్తుండగానే పరిస్థితులు చేజారిపోయాయి. దీంతో పరిస్థితి ని అదుపు లోకి తీసుకొచ్చేందుకు వీలుగా పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పెద్ద ఎత్తున లాఠీ ఛార్జ్ చేపట్టారు. దీంతో.. నిరసన చేపట్టిన మహారాజ్ చౌక్ వద్దనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఘర్షణలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో ఔరంగజేబు.. టిప్పు సుల్తాన్ లను పొగుడుతూ సోషల్ మీడియా లో పోస్టులు పెట్టిన వారి పై చర్యలు తీసుకుంటామ ని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపు లోకి ఉన్నప్పటికీ.. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెబుతున్నారు. తాజా పరిణామాల పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తో పాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు స్పందించారు.

తాజా పరిస్థితుల పై పోలీసుల తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతన్నారు. ఈ ఘటన పై విచారణ సాగుతుందని.. బాధ్యులను వదిలేది లేదని హెచ్చరించారు. మహారాష్ట్ర లో ఔరంగజేబు.. టిప్పు సుల్తాన్ లను కీర్తించే వారిని క్షమించమన్నారు. ఈ ఘటనల పై పోలీసులు సైతం చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.