అన్ని పార్టీలు ఏపీలో తిరుగుతూ ఉంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం అటు వైపు అస్సలు చూడడం లేదంట..ఏమైనా అంటే కరోనా అంటాడు.. ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నా.. వాటిని కనీసం ట్విట్టర్ ద్వారా కూడా ఈ మధ్య పట్టించుకోవడం లేదు అనే టాక్ నడుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టకపోవడానికి కారణం.. బీజేపీ వాళ్లు ఇంకొన్ని రోజులు సైలెంట్ గా ఉండమని చెప్పారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందంట.. ఎందుకంటే బీజేపీ బలోపడాలంటే ఇప్పుడే జరగాలని.. టీడీపీలో అసమ్మతి వాళ్లను చేర్చుకుంటే.. జనసేనను బీజేపీలో కలిపేసుకొని ఇంకా బలపడాలని బీజేపీ ప్లాన్ చేసిందని వినికిడి.
అప్పటివరకు జనసేనను కోల్డ్ స్టోరేజ్ లోకి పంపించి కేవలం టీవీల్లో చర్చలకే పరిమితం చేయాలని బీజేపీ ప్లాన్ అంట.. అంతిమంగా పవన్ కళ్యాణ్ పార్టీ మనుగడ ఏపీలో కష్టమని భావించి దాన్ని బీజేపీలో కలిపేసుకొని.. పవన్ ను బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా మార్చి సోము వీర్రాజు సారథ్యంలో 2024లో ఏపీ అధికారం చేపట్టాలన్నది బీజేపీ ప్లాన్ అంట. మరి ఇదంతా వర్కవుట్ కావాలంటే ప్రస్తుతానికి జనసేనాని సైలెంట్ గా ఉండాలన్నమాట.. అందుకే ఆ మౌనముద్ర వేశాడని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.