Begin typing your search above and press return to search.
ఇండియాలో ఇవాంకాకు అమెరికన్ భద్రత... మరి మనోళ్లకు అక్కడ దిక్కెవరు?
By: Tupaki Desk | 25 Nov 2017 9:12 AM GMT అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె - ఆయనకు సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యువర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తుండడం.. ఆమె రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుండడం తెలిసిందే. ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తల ప్రకారం ఇవాంకా భద్రత అంతా అమెరికా భద్రతా ఏజెన్సీల కనుసన్నల్లోనే, వారి సూచనల ప్రకారమే సాగుతున్నట్లుగా తెలుస్తోంది. భద్రతలో ఇక్కడి పోలీసుల పాత్ర ఎక్కువగా ఉన్నప్పటికీ మొత్తం వారి ప్రణాళిక ప్రకారమే చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇక్కడి అధికారులతో వారు సమావేశమవుతున్నారు కూడా.
ఇవాంకా రాక సందర్భంగా ఆమె దిగే విమానాశ్రయం నుంచి మొదలుకుని ఆమె వెళ్లే మార్గం, బస చేసే హోటల్ - సదస్సు జరిగే ప్రాంతం - ఆమెకు విందు ఇచ్చే ప్రదేశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతాపరమైన ఆంక్షలు మొదలైపోయాయి. ఇల్లిల్లూ సోదాచేసి ప్రతి ఒక్కరి వివరాలు సేకరించారు. 6000 మంది పోలీసులు భద్రత ఏర్పాట్లలో ఉన్నారు. సదస్సు జరిగే ప్రాంతానికి 4 కి.మీ. రేడియస్‌లో అనుమతి లేనివారెవరూ రాకుండా భద్రత కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా స్థానికులు, ఆ మార్గాల్లో నిత్యం వెళ్లివచ్చేవారు.. అక్కడుండే కార్యాలయాలు, అందులో పనిచేసే ఉద్యోగులు, ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునేవారు అంతా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. వేరే దేశాధినేత కుమార్తె కోసం తమను ఇంతగా ఇబ్బంది పెట్టడమేంటి... ఇంత హడావుడి ఎందుకన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
అంతేకాదు... అమెరికా అధ్యక్షుడి కుమార్తె కోసం ఆ దేశ భద్రత అధికారులు చెప్పినట్లే అంతా చేస్తుండడం కనిపిస్తోంది. మరి, అమెరికాకు భారత రాష్ర్టపతో - ప్రధానో వెళ్లేటప్పుడు కూడా ఇలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారా? అలాంటి సందర్భాల్లో అక్కడ మన దేశాధినేతల భద్రత బాధ్యత ఎవరు చూస్తున్నారు? అమెరికా భద్రతా వ్యవస్థలే ఈ బాధ్యత చూస్తున్నాయా.. లేదంటే భారతదేశ భద్రత వ్యవస్థలు - అధికారులే చూస్తున్నారా... లేదంటే ఇరుదేశాల పాత్ర ఉంటుందా? అసలు అక్కడ మనవాళ్ల భద్రత విషయంలో మన భద్రతా వ్యవస్థల పాత్ర ఉండడం కానీ, వీరి మాట కొంచెమైనా చెల్లుబాటు అవుతుందా అన్న సందేహాలూ కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మన దేశాధినేతలే కాదు, అమెరికాయేతర దేశాల అధినేతలు ఎవరైనా అమెరికాలో పర్యటించేటప్పుడు పాటించే భద్రతా విధానమేంటన్నది ఇప్పుడు చర్చనీయమవుతోంది. దీనికి సమాధానం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే... ఆ దేశానికి ఎవరు వెళ్లినా వారి రక్షణ బాధ్యత మొత్తం వారే చూస్తున్నారు... సంబంధిత దేశం పాత్ర ఉండడం లేదు.
ఇతర దేశాల అధ్యక్షులు - ప్రభుత్వాధినేతలు అమెరికా వెళ్తే అక్కడి సీక్రెట్ సర్వీస్ మాత్రమే మొత్తం భద్రత బాధ్యత అంతా చూస్తుంది. వారు అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లేవరకు అంతా వారి కనుసన్నల్లోనే ఉంటుంది. కేవలం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో పర్యటించినప్పుడు మాత్రమే కాదు, ఆ దేశంలో ఎక్కడ తిరిగినా వారి ఆధ్వర్యంలోనే భద్రత ఉంటుంది. ఆయా దేశాల భద్రతావ్యవస్థ పాత్ర ఉండదు. ఇది అమెరికా విదేశాంగ శాఖ వెబ్‌సైట్లో స్పష్టంగా రాసి ఉంది.
... మరి మన దేశానికి ఇవాంకా వస్తున్నప్పుడు అక్కడి భద్రతా వ్యవస్థల మితిమీరిన జోక్యం, హడావుడి ఏమిటో?
అమెరికా గవర్నమెంటు సమాచారంతో కూడిన ఈ లింకు చదవండి
https://www.state.gov/s/cpr/c18027.htm