Begin typing your search above and press return to search.

మంగళగిరి... ఫోకస్ ఏదీ బాబూ ?

By:  Tupaki Desk   |   27 Jun 2023 8:00 AM GMT
మంగళగిరి... ఫోకస్ ఏదీ బాబూ ?
X
వచ్చే ఎన్నికలు టీడీపీ కి అత్యంత కీలకం. అదే సమయం లో చంద్రబాబు కుప్పం సీటు ని కూడా లక్ష ఓట్ల మెజారిటీ తో గెలుస్తాను అని సవాల్ చేస్తున్నారు. ఆయన సీటు వరకూ ఓకే. మరి మంగళగిరి లో చినబాబు సీటు విషయం ఏంటి అన్నదే టీడీపీ లో చర్చగా ఉంది.

ఏపీ లో అధికార వైసీపీ మంగళగిరి ని గట్టిగా టార్గెట్ చేసింది. రాజధాని భూముల్లో పేదల కు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన అధికార వైసీపీ మంగళగిరి లో మరోసారి గెలిచేందుకే ఈ రకమైన రాజకీయ ఎత్తు వేసిందనే ప్రచారం కూడా సాగుతోంది. అక్కడ తమదైన శైలిలో ముచ్చటగా మూడవసారి పాగా వేయడానికి చూస్తోంది.

ఈ నేపధ్యంలో చంద్రబాబు ఎంత సేపూ కుప్పం టూర్లు పెట్టుకుంటున్నారు. అక్కడే ఉంటున్నారు. అక్కడ లక్ష ఓట్లు రావాల్సిందే అని క్యాడర్ కి నొక్కి చెబుతున్నారు. కానీఎ మంగళగిరి వైపు మాత్రం తొంగి చూడడంలేదు అని అంటున్నారు. లోకేష్ విషయమే తీసుకుంటే ఆయన గత ఆరు నెలలుగా పాదయాత్ర లో నిమగ్నమై ఉన్నారు.

ఆయన పాదయాత్ర వచ్చే ఏడాది ఎన్నికల వేళ కు కానీ పూర్తి అయ్యే అవకాశాలు లేవు. మరి వైసీపీ చూస్తే కొత్త ఎత్తులు వేస్తోంది. ఈ నేపధ్యంలో కుప్పం మీద ఉనన్ ఫోకస్ మంగళగిరి మీద లేదా అన్నదే హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది.

ఈ సారి కుప్పం లోనే బాబు ని ఓడించాల ని వైసీపీ చూస్తోంది. ఆ బాధ్యతల ను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించింది. ఆయన బాబు ఓటమి ని తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. ఇక మంగళగిరి లో సీనియర్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణా రెడ్డి ఉన్నారు. జగన్ సైతం మంగళగిరి మీద తానే స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు.

లోకేష్ కి మళ్ళీ ఓడిస్తేనే టీడీపీ కి సరైన దెబ్బ పడుతుంది అన్నది వైసీపీ ఆలోచన. అలాగే పవన్ కళ్యాణ్ సీటు విషయం లో ఏమీ తేలకపోయినా ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓడించేందుకు గట్టి అభ్యర్ధుల ను నిలబెట్టాలని వైసీపీ అన్నీ సిద్ధం చేసి ఉంచుకుంది.

పవన్ గోదావరి జిల్లాల లోనే బరి వేసి గిరి గీసి సవాల్ చేస్తున్నారు. ఆయన వారాహి యాత్ర కూడా అదే దిశగా సాగుతోంది. మరి మంగళగిరి వ్యవహారం ఏంటి అన్నదే తెలియడంలేదు అని అంటున్నారు. అయితే లోకేష్ రోజూ పాదయాత్ర తో కనిపిస్తున్నారు. ఆయన తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు.

ఏపీ లో టీడీపీ అనుకూల పవనాలు వీచేందుకు లోకేష్ పాదయాత్ర దోహదపడుతుందని, అదే జరిగితే ఆ ఊపుతో మంగళగిరిలో నూ మంచి మెజారిటీ తో చినబాబు గెలిచి తీరుతారు అని అంటున్నారు. టీడీపీ అధినాయకత్వం ఆ ధీమా తోనే మంగళగిరి లో తమ రాజకీయ వ్యూహాల ను సైలెంట్ గా చేసుకుని పోతోంది అని అంటున్నారు.