Begin typing your search above and press return to search.

పెళ్ళికి ముందు జుట్టు ఊడిపోతుందని ..ఓ యువకుడు ఏంచేసాడంటే !

By:  Tupaki Desk   |   28 July 2020 9:10 AM GMT
పెళ్ళికి ముందు జుట్టు ఊడిపోతుందని ..ఓ యువకుడు ఏంచేసాడంటే !
X
'నా చావుతో ఎవరికీ సంబంధం లేదు ,నా చావుకి నేనే కారణం, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు , కానీ అప్పుడే వెంట్రుకలు ఎక్కువుగా ఊడిపోతున్నాయి అందుకే నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను ' అని సూసైడ్ లెటర్ రాసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఈ నెల 25న మేడ్చల్ జిల్లా ఉప్పల్‌ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

పూర్తి వివరాలు చూస్తే .. శ్రీను (పేరు మార్చాము)‌ అనే ఓ యువకుడు గత కొద్దీ కాలంగా స్నేహితులతో కలిసి సత్యనగర్‌ కాలనీలో నివసిస్తున్నాడు. క్యాటరింగ్‌ పనులు చేస్తూ , వచ్చిన డబ్బుల్లోనే కొంత తల్లిదండ్రులకు పంపి కొంత డబ్బు దాచుకునేవాడు. డబ్బు దాచుకోవడానికి ఓ ముఖ్యమైన కారణం ఉంది. ఇటీవల శ్రీను కు ఈ మధ్య ఎక్కువగా జుట్టు రాలిపోతుండడంతో తీవ్ర ఆందోళన చెందేవాడు. పెళ్లి కాకముందే జుట్టు ఇలా ఊడిపోతుండటంతో డబ్బు దాచుకొని హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకున్నాడు. కానీ , కరోనా కారణంగా ఉపాధి కరువైంది. అలాగే , సోదరి పెళ్లికి డబ్బు పంపాలని ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో, తీవ్ర మనస్తాపం చెందిన శ్రీను ఈనెల 25న ఉదయం స్నేహితులు పని మీద బయటకు వెళ్లిన తర్వాత ఒంటరిగా ఉన్న సమయంలో‌ గదిలో ప్యాన్ ‌కు పంచెతో ఉరి వేసుకున్నాడు. మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో స్నేహితులు తిరిగి రాగా, గదికి తలుపు పెట్టి ఉంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చి, ఇంటి యజమానిని పిలిచి తలుపులు బలవంతంగా తీశారు. లోపల శ్రీను ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. చనిపోవడానికి ముందే రాసి పెట్టిన సూసైడ్‌ నోట్‌ పోలీసులకు చిక్కింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.