Begin typing your search above and press return to search.
ఇవాళ ఎంత మంచిరోజో.. పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్
By: Tupaki Desk | 15 Feb 2023 10:02 AM GMTఅనూహ్యంగా చోటు చేసుకున్న ఉదంతాల్లో విషాదం భారీగా ఉంటుంది. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి ఇవాళ చాలా మంచిరోజుగా చెప్పాలి. ఈ రోజు (బుదవారం) ఉదయం సికింద్రాబాద్ కు చేరుకోవాల్సిన గోదావరి ఎక్స్ ప్రెస్ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పింది. మంగళవారం సాయంత్రం విశాఖలో బయలుదేరిన గోదావరి ఎక్స్ ప్రెస్.. సికింద్రాబాద్ స్టేషన్ కు దగ్గరగా ఉన్న ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
అయితే.. ఈ సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉండటంతో.. ఘోర ప్రమాదం త్రుటిలో తప్పినట్లైంది. రైలు వేగం తక్కువగా ఉండటంతో.. నాలుగు బోగీలు పట్టాలు తప్పినప్పటికీ.. ఎవరికి ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. అనూహ్యంగా కుదుపులకు గురైన రైలు కారణంగా కొందరు ప్రయాణికులకు గాయాలైనట్లుగా చెబుతున్నారు. అయితే.. ఎలాంటి ప్రాణహాని లేకుండా ఉండటంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నాలుగు బోగీలు పట్టాలు తప్పటంతో.. అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారి భయాందోళనలకు గురయ్యారు. అయితే.. పెద్దగా ప్రమాదం ఏమీ చోటు చేసుకోలేదన్న విషయాన్ని గుర్తించి స్థిమిత పడ్డారు. తాజా ఉదంతంతో కాజీపేట - సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం చోటు చేసుకుంది.
రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి.. ట్రాక్ ను పునరుద్ధరిస్తున్నారు. ఒక్కసారిగా పట్టాలు తప్పిన నేపథ్యంలో.. రైలు కుదపులకు లోనైంది. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దిగేసి.. పరుగులు తీశారు. కాసేపటికి సర్దుకున్న వారు.. స్థిమితపడ్డారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.