Begin typing your search above and press return to search.
తిమింగళం కక్కింది.. రూ.2 కోట్లు వచ్చాయి!
By: Tupaki Desk | 20 Jan 2021 11:30 PM GMTమనుషులైనా.. మరో జీవి ఏదైనా వాంతి చేసుకుంటే మన ఫేస్ ఫీలింగ్స్ ఏంటీ..? గతంలో ఎప్పుడో జరిగిన సంఘటన గుర్తొచ్చిందా? ఛీ.. ఛీ.. యాక్ అంటున్నారా? మనసంతా ఏదోలా అయిపోయింది కదూ.. కానీ, ఈ విషయం తెలుసుకుంటే మాత్రం మీరు సంభ్రమాశ్చర్యమునకు లోనై తీరుతారు మరి!
థాయ్‌లాండ్‌లోని సమీలా బీచ్ వద్ద ఓ మత్స్యకారుడు చేపల వేటుకు వెళ్లాడట. సముద్రంలోకి దిగిన అతడికి వేట సాగిందో లేదో తెలియదు కానీ.. పడవ దిగి ఇంటికి బయల్దేరాడట. ఈ క్రమంలో బీచ్ లోని ఇసుకలో తెల్లటి ముద్దలాగ ఏదో కనిపించింది. ఏదో రాయి కాబోలు అనుకున్నాడట. అదేనా కాదా? అనుకుంటూ దగ్గరకు వెళ్లి చూస్తే.. ఇది దేనికో ఒకదానికి పనికొచ్చేలాగే అనిపించింది మనోడికి!
సర్లే.. ఇంట్లో పడి ఉంటుందని తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత ఇరుగు, పొరుగు చూడగా.. అందులో కొందరు అదేంటో చెప్పేశారు. అది తిమింగళం వాంతి. వేల్ వాంతి చేసుకున్న మొదట్లో ఇది నీళ్లపై తేలియాడుతూ ఉంటుంది. అలల తాకిడికి తీరానికి కొట్టుకొస్తుంది. పచ్చిగా ఉన్నపుడు కంపు కొడుతుంది కానీ.. గట్టిపడ్డాక మాత్రం అత్యంత సువాసన వెదజల్లుతూ ఉంటుంది!
తిమింగలం జీర్ణ వ్యవస్థలోని పిత్తాశయం నుంచి వెలువడ్డ స్రావం నుంచి ఇది తయారవుతుందట. దీన్ని పెర్ఫ్యూమ్ తయారీలో వాడుతారు. ఇది ఉండే సెంట్ బాటిల్ కు యమా క్రేజ్ మరి. ధర కూడా దానికి తగ్గట్టే ఉంటుందనుకోండి. జాలరికి దొరికిన ఈ వాంతి ముద్ద ధర రూ.2.09 కోట్లు పలికింది! కాగా.. గతంలో ఇంతకన్నా పెద్దదైన ముద్ద దొరకింది. అది ఏకంగా రూ.22 కోట్లకు అమ్ముడుపోయింది. ఇక, జాలర్లంతా చేపల వేట మానేసి.. తిమింగళం వాంతి కోసం వేటాడుతారో ఏమో!