Begin typing your search above and press return to search.

‘పశ్చిమ’లో టీడీపీకి గట్టి షాక్..!

By:  Tupaki Desk   |   7 Nov 2020 10:30 AM GMT
‘పశ్చిమ’లో టీడీపీకి గట్టి షాక్..!
X
ప్రతిపక్షంలోకి జారిపోయాక టీడీపీలో ఉండడానికి ఏ నేత ఇష్టపడడం లేదు. అధికారం బెల్లం కావడంతో దాని కోసం నేతలంతా ఎగబడుతున్నారు. ఆ క్రమంలోనే టీడీపీని వీడుతూ అధికార వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీలో జరిగిన లూప్ హోల్స్ అన్నింటిని బయటపెడుతున్నారు. చంద్రబాబు పరువును బజారుకీడుస్తున్నారు. తాజాగా ఓ నేత టీడీపీకి గుడ్ బై చెప్పి ఆ పార్టీ అధినేతపై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని వీరవెంకట సత్యనారాయణ సీతారామస్వామి (సోంబాబు) పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనమైంది. రాజీనామా పత్రాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు శుక్రవారం పంపారు.

2002లో టీడీపీలో సోంబాబు 18 ఏళ్ల పాటు ఆ పార్టీలోనే పనిచేశారు. 11 ఏళ్ల నుంచి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినా.. పార్టీ తనను ఏమాత్రం పట్టించుకోలేదని.. ఐదేళ్లలో ఏనాడు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వలేదని రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై టీడీపీతో సంబంధం లేదని.. తన ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటానని తెలిపాడు.

గత ఎన్నికల్లో ఉంగటూరు అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని సోంబాబు లేఖలో వాపోయారు. సభ్యత్వాల పేరుతో ఒక్కో జిల్లా నుంచి రూ.100 కోట్లు వసూలు చేసిన ఘనుడు అని ఆరోపించారు. ఒక్క గోపాలపురం నియోజకవర్గం నుంచే తాము రూ.60 లక్షలు వసూలు చేసి ఇచ్చామని తీవ్ర ఆరోపణలు చేశారు. సభ్యత్వం కలిగిన కార్యకర్త చనిపోతే వారికి ఇన్సూరెన్స్ కింద కొంత నగదు ఇస్తామని చెప్పారని.. ఎవ్వరికీ ఇవ్వలేదని ఆరోపించాడు.