Begin typing your search above and press return to search.
లంచాల అధికారి తిక్క కుదిరింది..సోషల్ మీడియా లో వీడియో పెట్టిన రైతు..
By: Tupaki Desk | 7 Nov 2020 7:15 AM GMTఆర్టీఏలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లంచాలకు రుచిమరిగాడు. రోడ్డు మీద పడి వచ్చీ పోయే వాహనాల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు. ప్రతిరోజు తాను పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయితే తప్ప ఆ రోడ్డును విడిచిపెట్టడు. వచ్చినవాడు రైతు అయినా, చిరు వ్యాపారి అయినా ఆయనకు సంబంధం లేదు. రోజుకు వేలరూపాయలు దోచుకుంటున్నాడు. విసిగిపోయిన ఓ వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్పెట్టాడు. దీంతో సదరు అధికారి ఉద్యోగం ఊడింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న మృత్యుంజయరాజు వాహనదారులను పీల్చి పిప్పిచేస్తున్నాడు. జాతీయ రహదారిపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గూడ్స్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి పెద్ద మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి వాహనం ఆపి డబ్బు డిమాండ్ చేశాడు. తాను రైతునని డబ్బు ఇచ్చుకోలేనని వేడుకున్నా.. కాళ్లమొక్కినా కనికరించలేదు. చివరకు రూ. 200 కడితేనే విడిచిపెడతానని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఈ దృశ్యాలను తన వీడియోలో బంధించి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. దీంతో మృత్యుంజయరాజు తిక్క కుదిరింది. ఈ వీడియో సంబంధిత శాఖ ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో దీనిపై వెంటనే స్పందించారు. తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్డుపై వాహన డ్రైవర్ల నుంచి లంచాలు వసూలు చేస్తున్న ఎంవీఐ మృత్యుంజయరాజును సస్పెండ్ చేస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ సీతా రామాంజనేయులు ఆదేశాలు జారీచేశారు.