Begin typing your search above and press return to search.

బెంగాల్ మంత్రిపై బాంబు దాడి.. మరో ఇద్దరికీ గాయాలు

By:  Tupaki Desk   |   18 Feb 2021 4:00 AM GMT
బెంగాల్ మంత్రిపై బాంబు దాడి.. మరో ఇద్దరికీ గాయాలు
X
పశ్చిమ బెంగాల్ మంత్రిపై బాంబు దాడి కలకలం రేపింది. ముర్షిదాబాద్ జిల్లా నిమిత్తి రైల్వే స్టేషన్ వద్ద దుండగులు నాటుబాంబులతో దాడి చేశారు. దాడిలో కార్మిక శాఖ మంత్రి జాకీర్ హుస్సేన్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జంగీపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తేలింది.

బాంబు దాడిలో మంత్రితోపాటు మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. వారిలో ఒకరు ఆయన మేనల్లుడు ఉన్నారు. రైలులో కోల్ కతా వెళ్లడానికి బుధవారం రాత్రి 10 గంటలకు నిమిత్తా రైల్వేస్టేషన్ కు మంత్రి వచ్చారు. ఫ్లాట్ ఫామ్ వద్ద వేచిచూస్తుండగా ఆయనపై బాంబు దాడి జరిగింది. దుండగులు ఒక్కసారిగా మంత్రిపై బాంబు విసిరారని స్థానికులు తెలిపారు.

బాంబు దాడిలో ఘటనతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దుండగులను కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరికొద్దిరోజుల్లోనే పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే బాంబు దాడి జరగడం కలకలం రేపింది.మంత్రి పరిస్థితి విషమంగా ఉండడంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ లో ఆందోళన వ్యక్తమవుతోంది.