Begin typing your search above and press return to search.

నేతాజీ మిస్టరీని కేంద్రమే విప్పాలి

By:  Tupaki Desk   |   19 Sep 2015 9:27 AM GMT
నేతాజీ మిస్టరీని కేంద్రమే విప్పాలి
X
బ్రిటిష్ పాలకులను నిద్రపోనివ్వకుండా చేయడమే కాకుండా ప్రపంచ నేతలతో చర్చలు జరిపి బ్రిటిషర్ లకు వ్యతిరేకంగా తన పోరాటానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసిన వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఇప్పటికీ ఎన్నో సందేహాలు... ఆయనకు సంబంధించి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం కొందరు కోరినా కేంద్ర ప్రభుత్వం వాటిని వెల్లడించలేదు. పలు దేశాలతో ఉన్న సంబంధాలు చెడిపోకుండా ఉండేందుకు నేతాజీకి సంబంధించిన రహస్యాలు కాపాడాల్సిన అవసరం ఉందని చెబుతూ వస్తోంది కేంద్రం. 1945లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదని.. ఆయన 1964 వరకు బతికే ఉన్నారని ఇప్పటికీ కోట్లాది మంది నమ్ముతుంటారు. అందులో నిజం పాళ్లే ఎక్కువని ఎన్నో అధ్యయనాలు, ఆధారాలు రుజువు చేశాయి కూడా. అయితే... అధికారికంగా వాటిని ధ్రువీకరించేవారే లేరు. ఆయన అప్పుడు చనిపోలేదు... స్వాతంత్ర్యం అనంతరం కూడా బతికే ఉన్నారని అంటుంటారు కానీ అధికారికంగా చెప్పడం మాత్రం లేదు. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నేతాజీ గురించి కొన్ని పత్రాలు విడుదల చేయడం సంచలనమే అయింది.. ఆ రాష్ట్రం 64 దస్త్రాలను బహిర్గతం చేసింది.

అదేసమయంలో మమత కేంద్రాన్ని నేతాజీకి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలనీ డిమాండు చేస్తున్నారు. కేంద్రం వద్ద 130 ఫైళ్లు ఉన్నాయని... వాటిని విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆమె డిమాండు చేస్తున్నారు. విదేశాలతో ఇబ్బందులు రావడమన్న ఆలోచనే అవసరం లేదని... భారత్ స్వతంత్ర దేశమని.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని ఆమె అంటున్నారు. మమత... నేతాజీకి సంబంధించిన దస్త్రాలు విడుదల చేయడం... కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడీ విషయం మళ్లీ చర్చనీయాంశమవుతోంది. మమత ఈ ఫైళ్లను విడుదల చేసిన సందర్భంగా శుక్రవారమే ''తుపాకీ'' 'నేతాజీ డెత్ మిస్టరీ వీడుతుందా?' కథనం రాసింది.

- నేతాజీ 1945 తరువాత బతికే ఉన్నారనడానికి పలు ఆధారాలు కనిపిస్తున్నాయి.

- నేతాజీ సోదరుడి కుమారుడు ఎస్ కే బోస్ రాసిన ఓ ఉత్తరాన్ని అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. 1949లో నేతాజీ చైనాలోని పెకింగ్ రేడియోలో మాట్లాడినట్లు ఆయన తన తండ్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

- స్విట్జర్లాండ్ కు చెందిన పాత్రికేయురాలు ఒకరు కూడా నేతాజీ సోదరుడు శరత్ చంద్రబోస్ కు రాసిన లేఖలో నేతాజీ పేకింగ్ లో ఉన్నట్లు రాశారు.

- ఇలాంటివి చాలా ఆధారాలు నేతాజీ కుటుంబీకులు, ఇతరుల వద్ద ఉండగా.. అధికారిక సమాచారం భారత ప్రభుత్వం వద్ద ఉంది.


​ నిన్నటి నేతాజీ స్టోరీ లింకు.. http://www.tupaki.com/politicalnews/article/Kolkata-Police-To-Reveal-Netaji-death-Mystery/113328