Begin typing your search above and press return to search.

మోడిపై దీదీ మైండ్ గేమ్

By:  Tupaki Desk   |   1 April 2021 1:30 PM GMT
మోడిపై దీదీ మైండ్ గేమ్
X
పశ్చిమబెంగాల్లో సరిగ్గా రెండోదశ పోలింగ్ కు ముందు మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోడిపై మైండ్ గేమ్ మొదలుపెట్టారు. నరేంద్రమోడి సర్కార్ కు వ్యతిరేకంగా దేశంలో ఉమ్మడి ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉందని మమత లేఖలు రాశారు. బీజేయేతర పార్టీల ముఖ్యమంత్రులు, కొన్ని రాష్ట్రాల్లోని విపక్షనేతలకు మమత లేఖలు రాశారు. ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదంలో పడిందని, రాజ్యాంగంపైనే కాకుండా సమాఖ్య వ్యవస్ధపైన కూడా మోడి సర్కార్ దాడులు చేస్తోందంటు మండిపడ్డారు.

లేఖలో మమత చాలా అంశాలనే ప్రస్తావించినా సరిగ్గా రెండోదశ పోలింగ్ కు ముందు మాత్రమే లేఖలు ఎందుకు రాశారు ? అన్నదే ప్రశ్న. ఇపుడే ఎందుకు రాశారంటే జరుగుతున్న ఎన్నికల్లో మళ్ళీ గెలవబోయేది తానే అని బెంగాల్ ప్రజలకే కాకుండా యావత్ దేశానికి చాటిచెప్పటమే ఉద్దేశ్యంగా కనబడుతోంది. పనిలోపనిగా రెండోదశ పోలింగ్ మొదలైన 30 నియోజకవర్గాల్లోనే మమత పోటీచేస్తున్న నందిగ్రామ్ కూడా ఉంది.

ఇక్కడ తన గెలుపు తథ్యమని జనాలకు చాటి చెప్పటంతో పాటు తనకే ఓట్లేయమని ఓటర్లను మమత అభ్యర్ధించటం కూడా అంతర్లీనంగా కనిపిస్తోంది. తన గెలుపుపై అభ్యర్ధి ధీమా వ్యక్తం చేయటమంటే తటస్తంగా ఉండే ఓటర్లను ఆకర్షించే వ్యూహం కూడా కనబడుతోంది. నందిగ్రామ్ లో గెలుపు నీదా-నాదా అనే స్ధాయిలో మమతకు సుబేందు అధికారికి మధ్య పోటీ తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతలు పెరిగిపోయింది.

ఇలాంటి నేపధ్యంలోనే ప్రత్యర్ధులందరిపైన మమత ఒకేసారి మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఇక్కడ నరేంద్రమోడి లేకపోతే అమిత్ షా, సుబేందు అధికారి అండ్ కో అంతా జీరోలే అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. కాబట్టే ఎన్నికల్లో తన టార్గెట్ మొత్తాన్ని మమత ప్రధానంగా మోడిపైనే దృష్టిపెట్టారు. నాలుగు రోజులు ఏకధాటిగా నందిగ్రామ్ లోనే క్యాంపు వేసిన దీదీ చివరిరోజున దేశంలోని బీజేపీయేతర ముఖ్యమంత్రులు, కొందరు ఎంపిక చేసుకున్న విపక్షనేతలకు లేఖలు రాయటం ఇందులో భాగమే. మరి దీదీ మైండ్ గేమ్ ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.