Begin typing your search above and press return to search.

మమత ఆశలన్నీ వాళ్ళపైనేనా?

By:  Tupaki Desk   |   1 April 2021 6:19 AM GMT
మమత ఆశలన్నీ వాళ్ళపైనేనా?
X
పశ్చిమబెంగాల్లో ఎలక్ట్రిఫైయింగ్ నియోజకవర్గంగా పేరుపొందిన నందిగ్రామ్ లో పోలింగ్ మొదలైంది. రెండోదశ పోలింగ్ జరిగే 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నందిగ్రామ్ కూడా ఒకటి. ఇలాంటి నియోజకవర్గంలో మమతబెనర్జీ-బీజేపీ అభ్యర్ధి సుబేందు అధికారి మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. మమతను ఓడిస్తే బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేసినట్లే అని కమలనాదులు అంచనాలు వేసుకున్నారు.

ఇదే సమయంలో సుబేందును ఓడిస్తే ప్రధానమంత్రి నరేంద్రమోడికి పెద్ద షాకిచ్చినట్లే అని మమత కూడా గట్టి పట్టుదలతో పోరాటం చేశారు. ఇలాంటి నియోజకవర్గంలో ప్రధానంగా రెండు అంశాలపైనే మమత గెలుపుపై ఆశలు పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మొదటిదేమో నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనారిటిల ఓట్లు. రెండోదేమో వామపక్షాల ఓట్లు. వామపక్షాల ఓట్లు చీలి మమతకు పడేందుకు అవకాశాలు తక్కువనే చెప్పాలి.

ఎందుకంటే సీపీఎం అభ్యర్ధిగా మీనాక్షీ ముఖర్జీ పోటీచేస్తున్నారు. కాబట్టి తమ ఓట్లు తాము సంపాదించుకోగలిగితే చాలా తనకు కూడా గెలుపు అవకాశాలున్నాయని మీనాక్షి ఆశాభావంతో ఉన్నారు. నియోజకవర్గంలో ఓట్లు 2.70 లక్షలు. ఒకపుడు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోట. అలాంటిది మమత బద్దలుకొట్టారు. అప్పటినుండి వామపక్షాల ఓట్లు తగ్గిపోతున్నాయి. ఇదే సమయంలో మమతకు అనుకూలంగా ఓట్లు పెరుగుతున్నాయి.

ఇక ముస్లింల ఓట్లు 27 శాతం ఉంది నియోజకవర్గంలో. నియోజకవర్గంలోని బ్లాక్ 1లో ముస్లిం ఓట్లు ఎక్కువుంటే బ్లాక్ 2 లో హిందువుల ఓట్లు ఎక్కువున్నాయి. కాబట్టి ముస్లిం ఓట్లు గంపగుత్తగా తనకే పడతాయని మమత ఆశలు పెట్టుకున్నారు. ఒకపుడు సీపీఎంను ఆదరించిన ముస్లింలు దశాబ్దకాలంగా మమతకు మద్దతుగా నిలబడ్డారు. మరి ఇపుడు ఎవరికి మద్దతుగా నిలబడతారో చూడాలి. ఎందుకంటే పోటీలో ముస్లిం ఫ్రంట్+కాంగ్రెస్ కూటమి తరపున అభ్యర్ధులున్నారు.

మనం మనం ఒకటే అనే పద్దతిలో ముస్లిం ఫ్రంట్ అభ్యర్ధులకు ముస్లిం ఓట్లు పోలవుతాయా ? లేకపోతే మమతకు మద్దతుగా నిలబడతారా ? అన్నది సస్పెన్సుగా మారిపోయింది. ఇదే సమయంలో సుబేందుకు హిందువుల ఓట్లు ఏమేరకు పడతాయనేది కూడా అర్ధం కావటంలేదు. మొత్తం మీద సుబేందుకు హిందువుల ఓట్లు, సీపీఎంకు వామపక్షాల ఓట్లు పడినా పడకపోయినా ముస్లిం ఓట్లుగనుక తృణమూల్ కే పడితే మమత గెలుపు ఖాయమనే చెప్పాలి.