Begin typing your search above and press return to search.

బెంగాల్ ఓటర్లకు మోడి గాలమేస్తున్నారా ?

By:  Tupaki Desk   |   4 March 2021 9:30 AM GMT
బెంగాల్ ఓటర్లకు మోడి గాలమేస్తున్నారా ?
X
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీలో అనుమానం మొదలైందా ? కేంద్రప్రభుత్వ తాజా నిర్ణయం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరుగుతోంది. జనపనార కనీస మద్దతుధర పెంచటానికి ఆర్ధిక వ్యవహారల కేంద్ర క్యాబినెట్ కమిటి నిర్ణయించినట్లు సమాచారం. 2019 సమయంలోనే జనపనారకు మద్దతు ధర పెంచుతు కేంద్రం నిర్ణయించింది. అప్పట్లో రూ 3700గా ఉన్న జనపనార మద్దతు ధరను కేంద్రం రూ. 3950కి పెంచింది.

ఇపుడు పశ్చిమబెంగాల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఎలాగైనా సరే అక్కడ బీజేపీ జెండాను ఎగరేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే మమతాబెనర్జీ కూడా నరేంద్రమోడి, అమిత్ షా ధ్వయాన్ని అంతే గట్టిగా ఎదుర్కొంటున్నారు. మూడోసారి వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని మమత కూడా పట్టుదలతో ఉన్నారు. తమకున్న అవకాశాలను ఉపయోగించుకుంటు బీజేపీ మమతను బాగా ఇబ్బందులు పెడుతున్నారు.

ఇలాంటి నేపధ్యంలోనే ఏబీపీ-సీ ఓటర్ తన సర్వే వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం ఎనిమిది విడతల్లో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మమతనే గెలుస్తుందని తేలింది. దాంతో బీజేపీ అలర్టయ్యింది. ఇందులో భాగంగానే జనపనార మద్దతు ధర మళ్ళీ పెంచాలని డిసైడ్ అయ్యింది. ఒకవైపు మద్దతు ధర పెంచుతునే మరోవైపు జనపనార పరిశ్రమకు భారీ ఎత్తున పెట్టుబడులు తేవాలని కేంద్రం భావిస్తున్నది.

దేశవ్యాప్తంగా ఉన్న జనపనార 70 పరిశ్రమల్లో 60 పరిశ్రమలు బెంగాల్లోనే ఉన్నాయి. దీంతోనే జనపనార పరిశ్రమ బెంగాల్ కు ఎంతటి కీలకమైన పరిశ్రమో అర్ధమైపోతోంది. ఈ పరిశ్రమపై లక్షలాదిమంది కార్మికులు ఆధారపడ్డారు. జనపనార పరిశ్రమ కార్మికులు సుమారు 30 నియోజకవర్గాల్లో గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. అందుకనే కేంద్రం ఈ పరిశ్రమపై ఇంతగా దృష్టిపెట్టింది. మొత్తానికి బెంగాల్ ఓటర్లకు మోడి గట్టి గాలమే వేస్తున్నట్లు అనిపిస్తోంది. మరి బెంగాలీయులు తగులుకుంటారా ?