Begin typing your search above and press return to search.

సీఎం పెయింటింగ్‌ లు సీజ్‌.. సీబీఐ సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   20 Dec 2018 10:30 AM GMT
సీఎం పెయింటింగ్‌ లు సీజ్‌.. సీబీఐ సంచ‌ల‌నం
X
సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్... కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి సీబీఐ షాక్ ఇచ్చింది. ఆమె వేసిన పెయింటింగ్స్‌ని సీజ్ చేయడం కలకలం రేపుతోంది. ఆమె వేసిన చిత్రాలు నాలుగేళ్ల క్రితం కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు రూ. 3 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు కొనుగోలు చేశాయి. అంత ధర పెట్టి కొనావాల్సినవసరం ఏముందని సీబీఐ ప్రశ్నించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె సీబీఐ తీరు పై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. సీబీఐ ని రాజకీయ కారణాలతో వాడుకొంటోందన్న ఆరోపిస్తున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. తమ రాష్ట్రంలో సోదాలు.. అరెస్టు చేయకుండా సీబీఐ ని నిరోధించే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.

వెస్ట్ బెంగాల్‌ లోని చిట్ ఫండ్ కార్యాలయాల పై ప్రధాన మంత్రి కార్యాలయానికి కొన్ని ఫిర్యాదులు వచ్చాయని... వాటిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదని సీబీఐ చెబుతోంది. ఒక్క శారదా చిట్ ఫండ్ సంస్థ రూ. 20 వేల కోట్లకి పైగా మోసం చేసిన సంగతి తెలిసిందే. దీని పై రూ. 500 కోట్ల మేర ఫండ్ ఏర్పాటు చేసి డిపాజటర్ల ను తృణముల్ ప్రభుత్వం ఆదుకొనే పని చేసింది. వాటి మోసాల పైనే సీబీఐ నాలుగేళ్లుగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో చిట్‌ఫండ్ సంస్థల్లో ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా గీసిన 20 పేయింటింగ్స్‌ని సీబీఐ తాజాగా స్వాధీనం చేసుకుంది. ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. తృణముల్ కాంగ్రెస్ సెక్రటరీ సుబ్రత బక్షీకి... రాజ్యసభ ఎంపీకి ఒబ్రీన్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది.

తన పార్టీని, పెయింట్సింగ్ అమ్మకాలతో తను పార్టీని నడుపుతున్నట్లు మమత పేర్కొంటున్నారు. ప్రస్తుతం సీబీఐ వీటి పై కూడా దృష్టి పెట్టడంతో రాజకీయ జోక్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని మమత సూచిస్తున్నారు. అయితే సీబీఐ మాత్రం పేయింటింగ్స్‌ని భారీ ధరకి విక్రయించడం ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించారని.. రాష్ట్రంలో చోటు చేసుకున్న చిట్ ఫండ్ కంపెనీల స్కాంలకు దగ్గరి సంబంధాలున్నాయంటూ సీబీఐ పేర్కొంటోంది. తొందరిలోనే ఈ రెండింటి లింక్‌లను బయట పెడుతామంటోంది. మాములు పేయింటింగ్స్ ఇంత భారీ ధరలకు ఎందుకు కొనుగోలు చేశారని..దీని వెనుక అధికార పార్టీని ప్రభావితం చేయడమేనని అంటోంది. అయితే.. పెయింటింగ్స్ మాత్రం చిట్ ఫండ్ ఓనర్లు సొంత డబ్బుతో కొన్నవా ? డిపాజిటర్ల సొమ్ముతో కొన్నవా ? అనేది సీబీఐ తేల్చబోతోంది.