Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ బడ్జెట్ లో వరాల జల్లు కురిపించిన దీదీ

By:  Tupaki Desk   |   6 Feb 2021 4:30 AM GMT
ఎన్నికల వేళ బడ్జెట్ లో వరాల జల్లు కురిపించిన దీదీ
X
ఎన్నికల ఏడాది వచ్చిందంటే చాలు.. వీలైనన్ని వరాలు.. అవకాశం ఉన్నన్ని తాయిలాలు ప్రకటించే ప్రభుత్వాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరించారు. మరి కొద్ది నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిపదవిని చేపట్టాలని బలంగా భావిస్తున్న ఆమె.. తాజాగా తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో సంక్షేమ పథకాల మోత మోగించారు.

ఇప్పటివరకు ఆ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే నగదు మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో రైతుసాయం కింద (క్రిషక్ బంధు పేరుతో బెంగాల్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అమలు చేసే రైతుబంధు పథకం స్ఫూర్తితో అమలు చేస్తోంది) రూ.5వేలు ఇస్తుండగా.. దాన్ని తాజాగా రూ.6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు జూన్ 21 వరకు రాష్ట్రంలోని అన్ని రకాల రోడ్డు ట్యాక్సుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఉచితన రేషన్ బియ్ంయం పంపిణీ పథకాన్ని జూన్ 21 వరకు కొనసాగిస్తామన్నారు. 1.5లక్షల మంది శరణార్థులకు దశల వారీగా భూపంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. 45 లక్షల నిర్మాణ.. రవాణా రంగ కార్మికులకు నెలకు వెయ్యి చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. జువశక్తి పేరుతో కొత్త పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ పథకంలో భాగంగా ప్రతి మూడేళ్లకు 10వేల మంది విద్యార్థుల్ని ఎంపిక చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసేందుకు వీలుగా ఇంటర్న్ షిప్ కల్పించనున్నారు. మొత్తంగా రూ.29.96వేల కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. పేదలకు తక్కువ ధరకు ఆహారాన్ని అందించే పథకం కోసం రూ.100 కోట్లు.. పలు కొత్త రోడ్లు.. వంతెనల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక నిధుల్ని బడ్జెట్ లోకేటాయించారు. రాష్ట్రానికి చెందిన 9 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వనున్నట్లుగా దీదీ ప్రకటించారు.