Begin typing your search above and press return to search.

బెంగాల్ లో బీజేపీ మేనిఫెస్టో మామూలుగా లేదుగా

By:  Tupaki Desk   |   22 March 2021 4:19 AM GMT
బెంగాల్ లో బీజేపీ మేనిఫెస్టో మామూలుగా లేదుగా
X
ఏది ఏమైనా సరే.. బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాల్ని చేస్తున్నాయి. అధికారంలో ఉన్న దీదీ సర్కారుకు తన తీరుతో చుక్కలు చూపిస్తున్న బెంగాలీ కమలనాథులు.. ఈసారి తాము పవర్లోకి రావటం ఖాయమని చెబుతున్నారు.అయితే.. ఇవన్నీ ఉత్త మాటలే అని.. చివరకు విజేతగా నిలిచేది తానేనని స్పష్టం చేస్తున్నారు. ఈ మాటల యుద్ధం ఇలా సాగుతుంటే.. మరోవైపు బెంగాల్ లో తమ ప్రభుత్వం కొలువు తీరితే.. తాము అమలు చేసే హామీల చిట్టాను తాజాగా వెల్లడించారు.

బంగారు బెంగాల్ సంకల్ప పత్రం 2021 పేరుతో విడుదల చేసిన ఇందులోని ముఖ్యాంశాల్ని చూస్తే..

- ఇంటికో ఉద్యోగం
- ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
- ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు
- మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం
- బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
- దళిత.. గిరిజన విద్యార్థినులకు ఆర్థిక సాయం
- ఎస్సీ.. ఎస్టీల వద్ద ప్రభుత్వ సర్టిఫికేట్లకు వసూలు చేసే ఛార్జీలు రద్దు
- అందుబాటులోకి ఇంజీనీరింగ్.. వైద్య విద్య.
- పదో తరగతి వరకు అన్ని స్కూళ్లలో బెంగాలీ తప్పనిసరి.
- అధికార భాషగా బెంగాలీకి గుర్తింపు.
- అవినీతికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో హెల్ప్ లైన్
- తల్లులు.. వితంతు మహిళలకు నెలకు రూ.3వేల పెన్షన్
- ఉత్తర బెంగాల్.. జంగల్ మహల్.. సుందర్ బన్ ప్రాంతాల్లో కొత్తగా మూడు ఎయిమ్స్ విద్యా సంస్థల ఏర్పాటు
- రైతులకు పీఎం కిసాన్ ద్వారా ఎకరానికి ఏటా రూ18వేల పెట్టుబడి సాయం
- మత్స్య కారులకు రూ.6వేల చొప్పున ఆర్థిక సాయం
- సత్యజిత్ రే అంతర్జాతీయ అవార్డుల పరిచయం
- ప్రతి బ్లాక్ లోనూ నేతాజీ బోస్ బీపీవోల ఏర్పాటు
- రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం.
- ఆసుపత్రులకు రూ.50 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు