Begin typing your search above and press return to search.
ఆడుకునేందుకు వెళ్లి.. చేతి వేళ్లు పోగొట్టుకుని.. అయ్యో..చిన్నారీ!!
By: Tupaki Desk | 8 May 2023 1:05 PM GMTబుడిబుడి అడుగులు వేసుకుంటూ.. మూడేళ్ల చిన్నారి ఆడుకునేందుకు వెళ్లింది. అయితే, ఆ పాప కు తెలియదు.. పెను ప్రమాదం.. అక్కడే ఉందని.. ఆ చిన్నారి తల్లిదండ్రు లూ ఊహించలేదు.. ఆడుకునే మాల్ పిల్ల జీవితానికి పెను ప్రమాదం తీసుకువస్తుందని.. దూసుకువచ్చిన ప్రమాదం.. మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యం..చిన్నారి చేతి వేళ్లను తినేశాయి. ఫలితంగా ఆడుకునేందుకు వెళ్లి చేతివేళ్లు పూర్తిగా పోగొట్టుకుంది ఆ పసిమొగ్గ. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో జరగడం గమనార్హం.
బంజారాహిల్స్ లోని సిటీ సెంటర్ మాల్ లోని ప్లే జోన్ మెషిన్ లో పడి మూడేళ్ల చిన్నారి చేతి వేళ్లు తెగిపోయాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ విస్మయానికి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇబ్రహీం నగర్ కు చెందిన ఓ వ్యక్తి ఆదివారం సెలవు కావడంతో తన ముగురు పిల్లలతో కలిసి బంజారాహిల్స్ లోని సిటీ సెంటర్ మాల్ కు వచ్చాడు.
మాల్ లో నాలుగో అంతస్తులో ఉన్న 'స్మాల్ ప్లే ఏరియా'లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈక్రమంలో అక్కడ తెరిచి ఉన్న ఓ మిషన్‌లో అనుకోకుండా మూడేళ్ల మెహ్వీష్ అనేక బాలిక చేయి చేపట్టడంతో ఆమె చేతి వేళ్లు నలిగిపోయాయి. చిన్నారిని వెంటనే కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక కుడిచేతికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయితే చిన్నారి మూడు వేళ్లు బాగా నలిగి పోయాయని.. తొలగించకతప్పదని వైద్యులు తెలిపారు. విధి లేని పరిస్థితిలో తల్లి దండ్రులు అంగీకరించడంతో బాలిక చేతి వేళ్లను వైద్యులు తొలగించారు.
ఇక ఈ ప్రమాదం భద్రతా వైఫల్యం వల్లే జరిగిందని, సిటీ సెంటర్ యాజమాన్యం పై చిన్నారి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిటీ సెంటర్ మాల్ యాజమాన్యం పై బంజారాహిల్స్ పీఎస్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తె కు జరిగిన నష్టానికి సెంటర్ మాల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి డిమాండ్ చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.