Begin typing your search above and press return to search.
నివేదిక చెబుతున్న అంచనా.. మారే జాబ్స్ 8.5 కోట్లు.. కొత్తగా వచ్చేవి 9.7 కోట్లు
By: Tupaki Desk | 22 Oct 2020 3:00 PM ISTగడిచిన కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లోకి ఆటోమేషన్ దూసుకొస్తోంది. దీని పుణ్యమా అని పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్న సంగతి తెలిసిందే.దీంతో..పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. మార్పు చెందే ఉద్యోగాలతో పోలిస్తే... కొత్తగా వచ్చే ఉద్యోగాలు భారీగా ఉంటాయన్నవిషయాన్ని వెల్లడిస్తోంది ప్రపంచ ఆర్థిక వేదిక. పొట్టిగా చెప్పాలంటే డబ్ల్యూఈఎఫ్.
ఈ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచ సగటుతో పోలిస్తే.. భారత్ లోని కంపెనీలు ఆటోమేషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం కంపెనీలు ఆటోమేషన్ దిశగా అడుగులు వేస్తుంటే.. భారత్ లో మాత్రం 58 శాతంగా ఉందని చెబుతున్నారు. డిజిటైలేజేషన్ లోనూ ప్రపంచ సగటు కంటే భారత్ సగటు ఎక్కువగా ఉండటం గమనార్హం.
కరోనా కారణంగా రోబో విప్లవం రావాల్సిన దాని కంటే ముందే వచ్చేసిందని చెబుతున్నారు. రానున్న ఐదేళ్లలో15 రంగాల్లో 8.5 కోట్ల ఉద్యోగాలు రూపాంతరం చెందే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో కొత్త ఉద్యోగాలు 9.7 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీరి అంచనా ప్రకారం 2025 నాటికి మనిషికి.. మెషీన్ కు సమానంగా పని ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు పోతాయన్న బెంగ పడే కన్నా..కొత్తగా వచ్చే అవకాశాన్ని చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉంది.
అందుకుతగ్గట్లే. అప్డేట్ కావాల్సిందే. మెషీన్లు ప్రాసెసింగ్ కు.. ఆడ్మినిస్ట్రేషన్ రంగానికి కొన్ని అంశాల్ని మాత్రమే డీల్ చేస్తాయని.. మనుషులు మాత్రం అందుకు భిన్నంగా సలహాలుఇవ్వటం.. సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవటం.. కమ్యునికేషన్ చేయటం లాంటివి మనుషులే చేయగలరని చెబుతున్నారు. సో.. పోయే ఉద్యోగాలు పోతున్నా.. వచ్చేవి వస్తున్నాయని చెప్పక తప్పదు.