Begin typing your search above and press return to search.

వీడి పంట పండింది.. లాటరీలో రూ.7300 కోట్లు

By:  Tupaki Desk   |   24 Jan 2021 5:50 AM GMT
వీడి పంట పండింది.. లాటరీలో రూ.7300 కోట్లు
X
లాటరీల చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఎవరూ గెలుచుకోలేదు కాబోలు. ఇంత భారీ లాటరీని గెలుచుకున్న అదృష్టవంతుడు ఎవరో కాదు.. అతడు అమెరికా వాసి. అమెరికాలో నిర్వహించిన లాటరీలో ఏకంగా 100 కోట్ల డాలర్లు ( దాదాపు రూ.7300 కోట్లు) గెలుచుకున్నాడు ఓ అదృష్టవంతుడు.

అమెరికా చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద లాటరీ. ఈ విషయాన్ని గ్రాసరీ చైన్ ప్రాంతీయ అధికార ప్రతినిధి రాచెల్ తెలిపారు. ఈ టికెట్ ను డెట్రాయిట్ లోని ఓ దుకాణంలో అమ్మినట్లు పేర్కొన్నారు.

విశేషం ఏంటంటే.. లాటరీ తీసే రెండు రోజుల ముందే ఈ టికెట్ ను విక్రయించారట.. మొత్తం 6 నంబర్లు పోల్చి చూడగా విజేతకు జాక్ పాట్ తగిలింది.

చివరి నిమిషంలో లాటరీ కొని కోట్లకు పడగలెత్తిన ఆ అదృష్టవంతుడి గురించి ఇప్పుడు అమెరికాలో వైరల్ అయ్యింది. తంతే బూరల బుట్టలో పడ్డట్టు ఏకంగా 100 కోట్ల కోటీశ్వరుడు అయిపోయాడు. అతడి దరిద్రమంతా ఒక్క లాటరీతో కొట్టుకుపోయిందట.. ధనలక్ష్మీ వెంట ఉంటే ఎక్కడున్నా అదృష్టం కలిసివస్తుందని తేలింది..