Begin typing your search above and press return to search.
తూ.గో.లో పెను విషాదం.. కొండ మీద నుంచి కింద పడిన పెళ్లి వ్యాన్
By: Tupaki Desk | 30 Oct 2020 6:00 AM GMTఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. అప్పటివరకు ఆనందంగా గడిపిన వారంతా అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పెళ్లి సంబంరం పూర్తి చేసుకొని తిరుముఖం పట్టిన వారు.. దారుణ ప్రమాదానికి గురయ్యారు. గురువారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ దారుణ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. ఇంతకీ జరిగిందేమంటే..
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలానికి చెందిన వారు పెళ్లి వేడుక కోసం తంటికొండ లోని శ్రీ వెంటేశ్వర స్వామి ఆలయానికి వచ్చారు. వివాహ వేడుకను పూర్తి చేసుకున్నారు. అనంతరం తిరిగి వెళుతున్న వేళ.. వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పింది. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ దారుణ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు.
బ్రేక్ ఫెయిల్ కావటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఘాటు రోడ్డులో వాహనం ప్రయాణిస్తున్న వేళ.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వ్యాన్ కొండ మీద నుంచి కింద పడటంతో తీవ్రత మరింత పెరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురిని హుటాహుటిన రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు స్పందించి.. సహాయక చర్యల్ని చేపట్టారు. సమాచారం తెలిసినంతనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ప్రమాదానికి కారణాలు ఏమిటన్న విషయంతో పాటు.. బాధితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు.