Begin typing your search above and press return to search.

అప్పడం.. బెండకాయ కూర పెట్టకుంటే లక్ష ఫైన్?

By:  Tupaki Desk   |   6 Dec 2015 4:32 PM IST
అప్పడం.. బెండకాయ కూర పెట్టకుంటే లక్ష ఫైన్?
X
బెండకాయ కూర.. అప్పడాలు లక్ష రూపాయిల మేర చిల్లు పెట్టాయి. వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ముందుగా ఒప్పుకొని ఒప్పందం చేసుకున్న తీరులో.. మెనూలో భాగంగా వడ్డించాల్సిన బెండకాయ కూర.. అప్పడాలు వడ్డించకపోవటంతో పాటు.. సేవల విషయంలో దొర్లిన తప్పులకు ఒక క్యాటరింగ్ సంస్థ భారీగా దెబ్బ పడింది. ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకున్న ఈ వ్యవహారం అందరిని ఆకర్షిస్తోంది.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిలాయ్ లోని సౌత్ ఫెరా అనే వెడ్డింగ్ ప్లానర్ ఒకరు ఉన్నారు. వీరు ఒక అధికారి కూమార్తె పెళ్లికి వెడ్డింగ్ ప్లాన్ ఒప్పందం చేసుకున్నారు. తాము ఒప్పుకున్న దానికి భిన్నంగా పెళ్లి విందులో బెండకాయ కూర.. అప్పడాలు వడ్డించలేదు. అంతే కాదు.. డెకరేషన్ విషయంలోనూ పలు తప్పులు దొర్లాయి. దీంతో.. ఒళ్లు మండిన సదరు అధికారిక వెడ్డింగ్ ప్లానర్ ను వినియోగదారుల కోర్టుకు లాగాడు.

సదరు అధికారి తాను పడ్డ అవస్తల గురించి కోర్టుక ఏకరువు పెట్టారు. దీనికి ధీటుగా సదరు వెడ్డింగ్ ప్లానర్ సైతం వాదనకు దిగాడు. అయితే.. వీరిద్దరి వాదనల్ని విన్న వినియోగదారుల కోర్టు.. సదరు వెడ్డింగ్ ప్లానర్ కు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఒప్పందంలో బాగంగా సేవల్ని అందించకపోవటంతో కోర్టు తాజా తీర్పు ఇచ్చింది. నిర్లక్ష్యానికి ఆ మాత్రం మూల్యం చెల్లించక తప్పదు.