Begin typing your search above and press return to search.

నగ్నంగా పెళ్లి కుమార్తె గెటప్.. వివాదం

By:  Tupaki Desk   |   26 Aug 2018 9:52 AM GMT
నగ్నంగా పెళ్లి కుమార్తె గెటప్.. వివాదం
X
సృజనాత్మకతకు అంతం లేదు. ఎంత క్రియేటివిటీగా చేస్తే అంతమంచి పేరు వస్తుంది. కానీ ఆ సృజనాత్మకత వెర్రివేశాలు వేస్తే.. సీన్ సితార్ అవుతుంది. బెంగాల్ లో ఓ మోడల్ పెళ్లికూతురు గెటప్ వేసుకొని మొత్తం బట్టలిప్పేసి నగ్నంగా ఫొటోలకు ఫోజిచ్చింది. ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా అక్కడి మందం కవర్ చేసింది. సంప్రదాయాలకు విలువనిచ్చే బెంగాలీలు దీనిమీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంప్రదాయం పేరు చెప్పి బట్టలిప్పుకు తిరిగితే ఎవ్వరూ ఊరుకోరని ఈ సంఘటన రుజువు చేసింది. బెంగాల్ లో ఓ మోడల్, ఓ ఫొటోగ్రాఫర్ క్రేజ్ కోసం చేసిన పని ఇప్పుడు విమర్శలపాలైంది. ఏకంగా వారిని చంపేస్తామంటూ సంప్రదాయవాదులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట.. దీంతో తమను రక్షించాలంటూ మోడల్-ఫొటోగ్రాఫర్ లు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.

బెంగాల్ కు చెందిన ప్రీతమ్ మిత్రా అనే మోడల్ ఇటీవల పెళ్లి కుమార్తె బ్యాక్ డ్రాప్ లో ఫొటో షూట్ లో పాల్గొంది. బెంగాలీ సంప్రదాయం ప్రకారం పవిత్రమైన నెత్తిన బెంగాలీ సంప్రదాయ కిరీటాన్ని ధరించి.. నుదుటున పెద్ద బొట్టు పెట్టుకుంది. కానీ ఆ తర్వాత బట్టలన్నీ విప్పేసి నగ్నంగా ఫొటోలకు ఫోజిచ్చింది. పైగా ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా కుంకుమ భరిణిని అక్కడ పెట్టుకుంది. ఇదేదో పెద్ద క్రియేటివిటీగా తీశామని సదురు మోడల్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసింది. అంతే .. సంప్రదాయవాదులు మండిపడుతున్నారు. ఫొటోను 24 గంటల్లో తొలగించి క్షమాపణలు చెప్పకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారట.. దీంతో ఈ కొత్తకు వింత ఫొటో షూట్ ఆ మోడల్-ఫొటోగ్రాఫర్ ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.