Begin typing your search above and press return to search.
ట్రెండ్ గా మారిన వెడ్డింగ్ ఇన్సూరెన్స్.. ఎందుకంటే?
By: Tupaki Desk | 31 Dec 2021 9:30 AM GMTపెళ్లికి మనం ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జీవితంలో ఒక్కసారి మాత్రమే (ఈ మధ్యన సెకండ్ మ్యారేజ్ జోరు పెరిగినప్పటికి) జరిగే ఈ వేడుక కోసం.. అందరూ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తుంటారు. మనోళ్లు పెళ్లికి ఇచ్చే ప్రాధాన్యత ఎంతంటే.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలాంటి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అంటే.. ఆ హడావుడి వేరుగా ఉంటుంది. అంతా సిద్ధమయ్యాక.. పెళ్లి వేడుక వాయిదా పడితే అంతకు మించిన డిస్పాయింట్ మెంట్ మరేం ఉండదు.
మానసికంగా కుంగిపోవటం ఒక ఎత్తు అయితే.. ఆర్థికంగా కూడా భారీగా నష్టం వాటిల్లుతుంది. కరోనా మహమ్మారికి ముందు.. అంతా డిసైడ్ అయ్యాక.. పెళ్లిళ్లు వాయిదా పడటం పూర్తిగా వ్యక్తిగతం. అది కూడా చాలా అరుదుగా మాత్రమే జరిగేవి. కానీ.. కరోనా పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.
అంతా డిసైడ్ అయ్యాక.. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కరోనా కారణంగా పెళ్లిళ్లు వాయిదా పడటం ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఆ మాటకు వస్తే.. పెళ్లి చేసుకునే విషయంలో పెళ్లి కొడుకు.. పెళ్లి కుమార్తె కంటే కూడా స్థానిక ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడే పరిస్థితి.
ఇప్పటివరకు వణికించిన కరోనా వేరియంట్లు ఒక లెక్క అయితే.. ఇప్పుడు విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ మరో లెక్కగా ప్రపంచం భావిస్తోంది. ఆసుపత్రికి పాలు కాము కానీ.. తీవ్రస్థాయిలో విస్తరిస్తున్న ఈ కొత్త వేరియంట్ దెబ్బకు ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటివేళలో వచ్చింది వెడ్డింగ్ ఇన్సూరెన్స్.
ఇంతకూ పెళ్లి బీమా ఏమిటంటే.. అనుకోని కారణాల వల్ల వివాహం రద్దు అయినా.. మరే ఇతర నష్టం వాటిల్లినా బీమా కంపెనీలు డబ్బులు చెల్లిస్తాయి. మొత్తం నాలుగు కేటగిరీల్లో వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్ని ఇస్తున్నారు. పలు బీమా సంస్థలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి.
ఆ నాలుగు కేటగిరీలను చూస్తే..
1. పెళ్లి వేడుక సమయంలో జరిగే ప్రమాదాలతో థర్డ్ పార్టీ ఆస్తులకు ఏమైనా నష్టం వాటిల్లితే ‘లయబులిటీస్ కవరేజ్’ పాలసీతో పరిహారం అందుతుంది.
2. అనుకోని కారణాలతో హటాత్తుగా పెళ్లి రద్దు అయితే.. జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు ‘క్యాన్సిలేషన్ కవరేజ్’ రూపంలో పాలసీని ఇస్తున్నారు.
3. పెళ్లి వేడుకల సమయంలో యజమాని ఆస్తులకు నష్టం వాటిల్లితే ‘ప్రాపర్టీ డ్యామేజ్’ పాలసీ తీసుకుంటే పరిహారం అందుతుంది.
4. పెళ్లి వేడుకకు బయలుదేరుతున్న వేళ.. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైతే.. పెళ్లి కొడుక్కి.. పెళ్లి కుమార్తెకు అయ్యే వైద్య ఖర్చులకు ‘పర్సనల్ యాక్సిడెంట్’ పాలసీతో బీమా పరిహారం పొందే వీలుంది. ఇదంతా బాగుంది.. ఇంతకీ పాలసీకి కట్టాల్సిన ప్రీమియం లెక్క సంగతేంటి? అన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం.
పెళ్లి బీమా పరే.. దానికి అయ్యే ప్రీమియం అన్నది తీసుకునే పాలసీ ఆధారంగా ఉంటుందని చెబుతున్నారు. ఉదాహరణకు పెళ్లి నష్టం రూ.10లక్షల కింద పాలసీ తీసుకుంటే.. దాని ప్రీమియం 0.7 శాతం నుంచి 2 శాతం వరకు ఉంటుంది. అంటే.. రూ.10లక్షల పాలసీకి కనిష్ఠంగా రూ.7500 నుంచి రూ.15వేల వరకు ఉంటుంది. ఇదేదో బాగుంది కదూ?