Begin typing your search above and press return to search.

నీటిలో పెళ్లి చేసుకున్న జంట‌..వైరల్ వీడియో

By:  Tupaki Desk   |   10 Sep 2021 1:40 PM GMT
నీటిలో పెళ్లి చేసుకున్న జంట‌..వైరల్ వీడియో
X
ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం , నాకు నచ్చింది నీకు నచ్చదు , నీకు నచ్చింది నాకు నచ్చదు. అయితే ,ఇంకా కొంతమంది రొటీన్ కి భిన్నంగా పనులు చేస్తూ . వార్తల్లో నిలవాలని కోరుకుంటారు. ధరించే దుస్తులనుంచి అన్నిటిలోనూ విభిన్నంగా ఉండాలని కోరుకునే యువత రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇక ఇటీవల కాలంలో సంప్రదాయంగా చేసుకునే పెళ్ళిళ్ళలో కూడా తమదైన ముద్ర వేయాలని, వెరైటీ చేసుకోవాలని కొంతమంది యువతీయువకులు ఆరాటపడిపోతున్నారు. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ఆందుబాటులోకి వచ్చిన తర్వాత తాము చేసిన పనులు ప్రపంచం మొత్తం చెప్పుకోవాలనే ఆరాటం అధికమయ్యింది.

ఈ నేపథ్యంలో ఓ యువ జంట తమ పెళ్లి వేదికగా నీటిని మార్చుకున్నారు. తమ పెళ్లి గురించి ప్రపంచం మొత్తం చెప్పుకోవాలని విమానంలో, పడవల్లో పెళ్లి చేసుకుంటారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట ఫుల్‌ వైరల్‌ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ జంట పెళ్లి చేసుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ వాళ్లు ఎక్కడ వివాహం చేసుకున్నారో తెలుసా,మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌ అన్నట్టుగా.. ఓ జంట నీటి అడుగున ఒక్కటై క్యా సీన్‌ హై అనిపించారు. స్కూబా డైవింగ్‌ అంటే ఎంతో ఇష్టపడే ఈ కొత్త జంట.. ఏకంగా నీటి అడుగున స్విమ్మింగ్‌ చేస్తూ మరీ పెళ్లి చేసుకున్నారు. స్కూబాపై తమకు ఉన్న ప్రేమను ప్రపంచానికి తెలిసేలా చేయాలనుకున్నామని, అందుకే ఇలా వెరైటీ పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది ఈ జంట. ఇంగ్లండ‌లోని బర్మింగ్‌ హామ్ లోని మార్స్టన్ గ్రీన్ లో ఉండే బేర్ గ్రిల్స్ అడ్వెంచర్ సెంటర్ లోని వారు ఈ విధంగా పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు.