Begin typing your search above and press return to search.
జామ్ కాల్ లో నేత బిజీ.. వెనుక వచ్చి నగ్నంగా నిలుచున్న భార్య
By: Tupaki Desk | 5 April 2021 8:46 AM GMTదేవుడా.. ఇలాంటి పరిస్థితి మరెవరికీ ఎదురుకాకూడదు అన్నట్లుగా ఉండే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఆ మధ్యన ఒక ప్రొఫెసర్ పెద్ద మనిషి జూమ్ కాల్ లో ఉంటే.. వెనుక నుంచి వచ్చిన భార్య.. సరసంగా ముద్దు పెట్టే ప్రయత్నం చేయటం.. దానికి ఆయన కసురుకుంటే.. ఆమె మాత్రం లైట్ తీసుకున్నట్లుగా వెళ్లిపోవటం తెలిసిందే. ఈ ఉదంతం అప్పట్లో సంచలనంగా మారింది. కరోనా వేళ.. ఎదురవుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టినట్లు ఉన్న ఈ ఘటనపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా దక్షిణాఫ్రికాలో చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి తెలిస్తే.. షాక్ తినాల్సిందే. ఆ దేశంలో గ్జోలిలే డేవు అనే నేత ఉన్నారు. కరోనా వ్యాప్తి.. మరణాలపై అధ్యయనం కోసం పార్లమెంటరీ సమావేశాన్ని జూమ్ లో నిర్వహిస్తున్నారు. ప్రతినిధులతో తన ఇంటి నుంచే మాట్లాడుతున్నారు. మీటింగ్ జోరుగా జరుగుతున్న వేళ.. ఆయన వెనుకన వచ్చి నిలబడ్డారు ఆయన సతీమణి ఒంటి మీద నూలుపోగు లేకుండా. దీంతో.. సమావేశంలో ఉన్న వారంతా అవాక్కు అయ్యారు.
ఇదేమీ తెలీని సదరు నేత.. తాను చెప్పాల్సింది చెబుతూనే ఉన్నారు. దీంతో.. సమావేశంలో పాల్గొన్న వారిలో ఒక నేత.. ‘అందరూ చూస్తున్నారు. లైవ్ లో ఉన్నారన్న విషయాన్ని మీకు ఆమెకు చెప్పలేదా?’ అంటూ ప్రశ్నించటంతో.. సదరు నేత వెనక్కి తిరిగి చూసి షాక్ తిన్నారు. వెంటనే.. సిగ్గుతో ముఖానికి చేతులు అడ్డం పెట్టుకున్నారు. అనంతరం సమాశంలో ఉన్న నేతలకు సారీ చెప్పారు. ఈ ఉదంతం చెప్పే గుణపాఠం ఒక్కటే.. ఆన్ లైన్ మీటింగ్ లలో ఉండే వేళలో. ఇంట్లోని వారికి ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావటం ఖాయం.