Begin typing your search above and press return to search.

ఋతుపవనాలతో తుఫాన్... బీ అలర్ట్

By:  Tupaki Desk   |   8 Jun 2023 11:00 AM GMT
ఋతుపవనాలతో తుఫాన్... బీ అలర్ట్
X
ఉదయం ఎండలు.. సాయంత్రం వర్షాలు... ఇది తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి. సూర్యుడి ప్రతాపానికి జనం ఉదయమంతా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సాయంత్రం మాత్రం వరుణుడి ఎంటర్ అవడంతో... వర్షాలు పడుతున్నాయి.

అయితే అరేబియా సముద్రంలో బిపర్జాయ్ తుఫాను ఏర్పడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటు ఈశాన్య రుతుపవనాలు రేపు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అయితే ఈనెల 4న రుతు పవనాలు వస్తాయని మేలో వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ ఇది కాస్త ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. తమిళ నాడులో భారీ వర్షాలు కురువనున్నాయట. అండమాన్ నికోబార్ దీవుల్లో జూన్ 9వ తేదీ వరకు, కేరళలో జూన్ 11వ తేదీ వరకు కొనసాగుతుందని తెలుస్తోంది. జూన్ 9 నుంచి 11వ తేదీ వరకు లక్షదీప్, జూన్ 10, 11 తేదీల్లో కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 17 లేదా 18 తేదీల్లో రుతు పవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తోంది ఐఎండీ. కేరళ, తమిళనాడు, లక్షదీప్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌ లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాముందని చెబుతోంది.

ఇక ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో జనాలు ఉష్టోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన ఎండ, వడ గాల్పులతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఏపీలో పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వాతావరంణలో మార్పు కనిపిస్తోంది. ఈ ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

అటు తెలంగాణలో హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో తేలిక పాటి జల్లులు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురియనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా కిందిస్థాయి గాలుల ప్రభావంతో ఎండలు ఎక్కువై జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.