Begin typing your search above and press return to search.

బిగుతు జీన్స్ వేస్తున్నారా ..ఇక అంతే సంగతులు

By:  Tupaki Desk   |   4 Nov 2019 10:26 AM GMT
బిగుతు జీన్స్ వేస్తున్నారా ..ఇక అంతే సంగతులు
X
జీన్స్ ప్రస్తుత ప్రపంచం లో అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్ ఇప్పుడు ఒక సంచలనం. ఈ జీన్స్ ని చిన్నపిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ ఉపయోగిస్తున్నారు. వేసుకోవడానికి ఈజీగా , చూడటానికి అందంగా ఉండటం తో యువత వీటివైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీనితో రకరకాలైన సమస్యలు వచ్చి పడుతున్నారు. జీన్స్ వేసుకోవడం వల్ల గజ్జి , తామర వంటి వ్యాధులు వస్తున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. అలాగే మగవారు బిగుతుగా ఉండే జీన్స్ వేసుకోవడం వల్ల అనేక రకమైన సమస్యలు వస్తున్నాయి.

తాజాగా దీనిపై విజయవాడలో వ్యాధుల నియంత్రణ - నూతన సాంకేతిక విజ్ఞానం పై ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యువతి , యువకులు జీన్స్ వేసుకోవడం వల్ల వచ్చే కొన్ని సమస్యల గురించి వారు వివరించారు. ముఖ్యంగా పిల్లల వస్త్రధారణ పై తల్లిదండ్రులు శ్రద్ద వహించాలని తెలిపారు. దీనిపై డాక్టర్స్ బృందం మాట్లాడుతూ .. జీన్స్ ప్యాంట్ ని కొన్ని రోజులపాటు ఉతక్కపోయినా వేసుకోవచ్చు , అలాగే ఒకసారి కొంటె రెండు , మూడేళ్ళ పాటు పనిజరుగుతాయి అనే ఉద్దేశం తో యువత వీటికి ఆకర్షితులౌతున్నారు అని చెప్పారు. జీన్స్ వేసుకుంటే చాలా బిగుతుగా ఉండటం తో గాలి ఆడక చర్య సమస్యలు వస్తున్నాయని , ప్రతి 100 మందిలో 10 మంది చర్మ సంబంధిత వ్యాధిగస్త్రులు ఉన్నారంటూ తెలిపారు. ముఖ్యంగా ఈ సమస్య స్కూల్స్ కి వెళ్ళేవారిలో ఎక్కువగా ఉంది అని , స్కూల్ లో ఎక్కువమంది మధ్య ఇరుకురుకుగా కూర్చోవడం వల్ల అలాగే స్కూల్ కి వెళ్లి వచ్చిన తరువాత సరిగా స్నానం చేయకపోవడం వల్ల కూడా ఈ చర్మ సమస్యలు ఎక్కువైయ్యాయి అని తెలిపారు. దీనితో మగవారిలో మర్మాంగం. ఆడపిల్లల్లో జననాంగం వద్ద ఇన్ ఫెక్షన్స్ వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే .. జీన్స్ ని సరిగ్గా ఉతకడం , ఆరబెట్టిన తరువాత ఇస్త్రీ చేయడం , సందర్భాన్ని బట్టి ..రోజుకి 2 , 3 సార్లు స్నానం చేయడం ద్వారా చర్మ వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు.