Begin typing your search above and press return to search.

ఆ ట్యాక్సీలో ఎక్కాలంటే మాస్క్ పెట్టుకోకూడదు !

By:  Tupaki Desk   |   8 Aug 2021 12:30 AM GMT
ఆ ట్యాక్సీలో ఎక్కాలంటే మాస్క్ పెట్టుకోకూడదు !
X
నిన్న ,మొన్నటి వరకు హెల్మెట్‌ పెట్టుకోకుంటే, కారులో కూర్చున్న వారుసీటు బెల్టు ధరించకుంటే జరిమానాలు వేసిన అధికారులు , కరోనా మహమ్మారి దెబ్బకి ముఖానికి మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది సైతం మాస్కులు తప్పనిసరి ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, జనావాసాలు, మార్కెట్లు, బస్టాప్‌ లు, ఆలయాలు, రైతుబజార్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్‌మాల్స్‌, బట్టల దుకాణాలు తదితర వాటితో పాటు రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్‌లు, విమానాశ్రయాలు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్స్‌ తదితర అన్ని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లలో కూడా మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

మాస్కును ముక్కు, నోరును కవర్‌ చేసే విధంగా కాకుండా కేవలం నోటికి లేదా గదమ దగ్గర మాత్రమే మొక్కుబడిగా మాస్కు ధరించినా మాస్కు ధరించని వారికి విధించే జరిమానానే వారికి కూడా వర్తిస్తుందన్నారు. ప్రతిఒక్కరూ బయటకు లేదా ప్రజల మధ్యకు వస్తే విధిగా మాస్కు ధరించాల్సిందేన న్నారు. కొందరు కరోనా తగ్గింది కాబట్టి ఇక మాస్క్ అవసరం లేదు అని అనుకుంటున్నారు. కానీ, కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు. కరోనా నియమాలు పాటించకపోతే మళ్లీ కరోనా మహమ్మారి వచ్చే అవకాశం ఉంది.

ఇలా అందరూ కరోనా నియమాలు పాటించాలి. మాస్క్ పెట్టుకోండి, కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి వినియోగించే టీకా వేసుకోండి అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో మాస్క్ లేకుంటే ఫైన్ వేస్తున్నారు. రెస్టారెంట్‌, ఆటో, బ‌స్సు, రైలు, ట్యాక్సీ ఎందులో ప్ర‌యాణం చేయాల‌న్నా మాస్క్ పెట్టుకోవాల్సిందే. క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా ఉండాలంటే త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని, వ్యాక్సిన్ తీసుకోవాల‌ని చెబుతున్నారు. అయితే, కొంత‌మంది మాస్క్‌ను, వ్యాక్సినేష‌న్‌ను పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నారు. యో అనే ఓ ట్యాక్సి కంపెనీ ఇదే బాట‌లో ప‌య‌నిస్తోంది.

త‌మ ట్యాక్సిల్లో ప్ర‌యాణం చేసేవారు మాస్క్ పెట్టుకోకూడ‌ద‌ని, వ్యాక్సిన్ తీసుకోకూడ‌ద‌ని ప్ర‌క‌టించింది. త‌మ సంస్థ వ్యాక్సినేష‌న్‌ను పూర్తిగా వ్య‌తిరేకిస్తోందని, త‌మ ట్యాక్సిలో ప్ర‌యాణం చేయాల‌నుకునే ప్ర‌యాణికులు వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అని ముందుగా ప‌రిశీలిస్తామ‌ని, ట్యాక్సీ ఎక్కిన త‌రువాత లోప‌ల మాస్క్ పెట్టుకోబోమ‌ని చెప్పిన త‌రువాతే ట్యాక్సీ ప్ర‌యాణం చేస్తుందని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఆ యో ట్యాక్సీ కంపెనీ మిస్సౌరీ రాష్ట్రంలో ఉన్న‌ది. అమెరికాలో వ్యాక్సిన్ మంద‌కోడిగా సాగుతున్న రాష్ట్రాల్లో టాప్ 3 లో మిస్సౌరీ కూడా ఉండ‌టం విశేషం.