Begin typing your search above and press return to search.
కాటన్ మాస్క్ ధరిస్తే గంటలోనే కరోనా వైరస్ ను చంపేస్తుందట !
By: Tupaki Desk | 13 Nov 2020 12:30 PM GMTచైనాలోని వూహాన్ సిటీలో పుట్టిన కరోనా ,అతి పెద్ద మహమ్మారిగా మారి ప్రపంచ దేశాల ప్రజలను గడగడలాడిస్తోంది. కరోనా పేరు చెబితేనే ప్రపంచం వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్క్ లు, శానిటైజర్లు తప్పని సరిగా వాడాల్సిన పరిస్థితి. అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా మహమ్మారి మాత్రం ఎటు వైపు నుంచి ఎవరిని కాటేస్తుందో తెలియని పరిస్థితి. కరోనా మహమ్మారి భయంతో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు లేకుండా బయటకు రాలేని పరిస్థితి.. అయితే, ఏ మాస్క్ అయినా కంటిన్యూగా 4 గంటలు వాడామంటే దానిపై వాలే కరోనా, మెల్లగా అన్ని దిక్కులకూ పాకి, అలా అలా ముక్కు, నోట్లోకి వెళ్లిపోతుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఒక మాస్కును 4 గంటల కంటే ఎక్కువగా కంటిన్యూగా వాడకూడదని అంటున్నారు.
ఇక వ్యాక్సిన్ రావడానికి మరింత సమయం పడేటట్లు ఉన్న వేళ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఓ కాటన్ మాస్క్ గొప్ప ఆశాకిరణంగా కనిపిస్తోంది. వైరస్, బ్యాక్టీరియాను ఈ మాస్క్ 99.99 శాతం హతమారుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మాస్క్ ధరించి సూర్యకాంతిలో 60 నిమిషాలు ఉంటే వైరస్ ఖతమైపోతుందని , మళ్లీ మళ్లీ ఉపయోగించగలిగేలా మాస్కును అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, దీనిని ధరిస్తే గంటలోనే ఇది 99.9999 శాతం బ్యాక్టీరియా, వైరస్‌ను చంపేస్తుందని వివరించారు. ఈ మాస్కును ధరిస్తే సూర్యకాంతి పడిన గంటలోనే వైరస్ చనిపోతుంది. ఈ సరికొత్త ఫేస్‌మాస్క్‌ను పదిసార్లు ఉతకవచ్చని, దానిలోని యాంటీమైక్రోబయాల్ చర్యను కోల్పోకుండా కనీసం వారం పాటు సూర్యరశ్మి తగిలేలా చూడాలని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
ఈ సరికొత్త కాటన్ మాస్క్ పై సూర్యకిరణాలు పడిన వెంటనే రీయాక్టివ్ ఆక్సిజన్ స్పైసెస్ ను విడుదల చేస్తుందని , ఫలితంగా మాస్క్‌పై ఉన్న మైక్రోబ్స్ చనిపోతాయని తెలిపారు. డీఈఏఈ-ఈఐ ధనాత్మక చార్జ్ గొలుసును సాధారణ కాటన్ కు అనుసంధానించడం ద్వారా పరిశోధకులు ఈ సరికొత్త కాటన్ ఫ్యాబ్రిక్ ను తయారు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో ఈ మాస్క్ అందరికి ఉపయోగపడనుంది.