Begin typing your search above and press return to search.

పూణె పాఠ‌శాల‌లో క్ర‌మ `శిక్ష‌`ణ‌!

By:  Tupaki Desk   |   4 July 2018 4:53 PM GMT
పూణె పాఠ‌శాల‌లో క్ర‌మ `శిక్ష‌`ణ‌!
X
పాఠ‌శాల స్థాయిలోనే విద్యార్థుల క్ర‌మ‌శిక్ష‌ణ అవ‌స‌రం. కాబ‌ట్టి ప్ర‌భుత్వ స్కూళ్ల‌తో పోలిస్తే...ప్రైవేటు స్కూళ్ల‌ లో ఆ క్ర‌మ‌`శిక్ష‌`ణ స్థాయిలు కొద్దిగా ఎక్కువే ఉంటాయి. అయితే, పుణెలోని `విశ్వశాంతి గురుకుల్‌ విద్యా సంస్థ`లో మాత్రం క్ర‌మ శిక్ష‌ణ మోతాదుకు మించింది. ఆ పాఠ‌శాల‌లో క్ర‌మ శిక్ష‌ణ శృతిమించి విద్యార్థుల పాలిట `శిక్ష‌`గా మారడం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆ పాఠ‌శాల‌లో బాలికల లోదుస్తుల రంగు పై యాజ‌మాన్యం జారీ చేసిన మార్గదర్శకాలపై పెను దుమారం రేగుతోంది. అక్క‌డ చ‌దివే విద్యార్థినులు కేవ‌లం తెలుపు రంగు లో దుస్తులు మాత్ర‌మే ధ‌రించాల‌నే నిబంధ‌న విధించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ వ్య‌వ‌హారంపై పిల్ల‌ల త‌ల్లిదండ్రులు మండిప‌డ్డారు. ఆ నిబంధ‌న‌ల‌ను వ్య‌తిరేకిస్తూ....ఆ పాఠ‌శాల యాజ‌మాన్యంపై ప్రాధమిక విద్యా డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం ఆ పాఠ‌శాల‌కు ఉత్త‌ర్వుల వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

అన్ని పాఠ‌శాల‌ల మాదిరిగానే పుణె లోని విశ్వశాంతి గురుకుల్‌ విద్యా సంస్థ లో కూడా నూతన విద్యా సంవత్సరం ప్రారంభ‌మైంది. అయితే - ఆ పాఠ‌శాల‌లోని విద్యార్థినుల‌కు ఇచ్చిన డైరీల్లో పాఠ‌శాల యాజ‌మాన్యం వింత నిబంధ‌న విధించింది. అక్క‌డి బాలికలు తెలుపు రంగు లోదుస్తులు మాత్రమే వేసుకోవాలని డైరీలో పొందుప‌రిచారు. దాంతోపాటు - నిర్ధిష్ట స‌మ‌యంలోనే టాయిలెట్ లు ఉప‌యోగించ‌డం - మంచినీరు తాగ‌డం....నిర్దేశించిన చెత్త కుండీల్లోనే చెత్త వేయడం...వంటి అనేక రూల్స్ ఉన్నాయి. అవి పాటించ‌క‌పోతే 500 రూపాయ‌ల జ‌రిమానా కూడా విధిస్తారు. అంతేకాదు, విద్యార్థినులు బలవంతంగా ఆ ప్రతిపాదనకు ఒప్పుకునేలా వ్య‌వ‌హరించారు. దీంతో, ఆ నిబంధ‌న‌ పై తల్లితండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బాలికల భద్రత కోసమే ఈ త‌ర‌హా నిబంధ‌న‌లు పొందుపరిచామని స్కూల్‌ యాజమాన్యం త‌న చ‌ర్య‌ల‌ను సమర్ధించుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ఆ మార్గదర్శకాలకు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలుపుతూ తల్లితండ్రులు స్కూల్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. యాజ‌మాన్యం తీరుపై ప్రాధమిక విద్యా డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు.