Begin typing your search above and press return to search.

యోగీ, షాలను చంపేస్తాం .. 'ఈ మెయిల్' బెదిరింపు!

By:  Tupaki Desk   |   6 April 2021 7:16 AM GMT
యోగీ, షాలను చంపేస్తాం .. ఈ మెయిల్ బెదిరింపు!
X
భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలైను హతమారుస్తాం అంటూ వచ్చిన ఓ 'ఈ మెయిల్'‌ బెదిరింపు ఇప్పుడు దేశంలో కలకలం రేపుతోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌, కేంద్రమంత్రి అమిత్ షాల‌ను పదవులనుంచి తొలగించండి, లేకపోతే ఆ ఇద్దరిని చంపేస్తాం, అంటూ ముంబై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆఫీస్‌ కు మంగ‌ళ‌వారం ఉద‌యం ఒక ఈమెయిల్‌ వచ్చిందట. ఈ 'ఈ మెయిల్' దేశవ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ముంబైలోని సీఆర్పీఎఫ్ ఆఫీస్‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం ఈ ఈమెయిల్ వ‌చ్చినట్లు అధికారులు వెల్లడించారట. ఆత్మాహుతి దాడుల ద్వారా అమిత్ షా, యోగిని చంపేస్తామంటూ ఆ మెయిల్‌ లో తెలిపారట. దీనితో పాటు ప్రార్థనా మందిరాలు, ఇత‌ర ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా దాడులు చేస్తామ‌ని హెచ్చరిస్తూ మెయిల్ ‌లో పొందుపరిచారు. 11 సూసైడ్ బాంబర్ల ద్వారా ఈ దాడులు చేస్తామంటూ మెయిల్ లో రాశారని అధికారులు తెలిపారు. కాగా, ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరు పంపారన్నది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.