Begin typing your search above and press return to search.
వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పథకాలు కట్ చేస్తాం: జోగి రమేశ్?
By: Tupaki Desk | 11 Feb 2021 4:06 PM GMTఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు ఈ ఫిర్యాదులు చేస్తున్నారు.తాజాగా కృష్ణ జిల్లా పెడన అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన కామెంట్లు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పోటీగా నామినేషన్లు వేస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జోగి రమేశ్. ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే అధికార పార్టీ నేతలపై పోటీకి దిగుతారా? అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.
ఏపీలో వైసీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసే ప్రత్యర్థులకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సీఎం జగన్ అనేక పథకాలు అమలు చేస్తున్నా.. వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తాం అంటూ జోగి తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఏకగ్రీవాలు చేయాలంటూ ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే అధికార పార్టీ నేతల అభీష్టానికి వ్యతిరేకంగా పలు చోట్ల విపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. దీంతో వైసీపీ నేతల్లో అసహనం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.