Begin typing your search above and press return to search.
అవినీతి చేస్తాం.. జగన్ కు చెప్పుకో!
By: Tupaki Desk | 14 July 2020 6:15 AM GMTగత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఓడిపోవడానికి ప్రధాన కారణం ‘జన్మభూమి కమిటీలు’ అంటారు. వారి క్షేత్ర స్థాయి దోపిడీ కారణంగానే టీడీపీకి నూకలు చెల్లాయంటారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగులపై కూడా అలాంటి విమర్శలే వస్తున్నాయి. ఇప్పటికే చాలా మందిపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా ప్రశ్నించిన వైసీపీ నేతలకే చుక్కలు చూపించారు సచివాలయ ఉద్యోగులు..
‘అవినీతి చేస్తాం.. ఎమ్మెల్యేకు చెప్పుకుంటావో.. జగన్ కు చెప్పుకుంటావో చెప్పుకో’ అని ఓ సచివాలయ ఉద్యోగి వైసీపీ నేతకు గట్టి షాక్ ఇచ్చింది. దీంతో సచివాలయ ఉద్యోగులు.. వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మీకు దిక్కున్నచోట చెప్పుకోమని సచివాలయ ఉద్యోగులు ఖారాఖండీగా వైసీపీ నాయకులకు చెప్పారని తెలిసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో వైసీపీ నాయకులు ఎంపీడీవోకి ఫిర్యాదు చేశారు.
చుండి గ్రామంలో సచివాలయ సిబ్బంది లంచాలు తీసుకుంటూ గ్రామంలో అర్హులైన టైలరింగ్, రజకులకు సంబంధించి నిరుపేదలైన వారి వద్ద లంచాలు తీసుకుంటూ జగనన్న చేదోడు పథకం కింద దరఖాస్తు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే అనర్హులంటూ తమ పేరు ఆన్ లైన్ లో పెట్టడం లేదంటూ వారు మండిపడుతున్నారు.
ఇటీవల దీనిపై వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ లు గ్రామంలో విచారించగా ఒక్కొక్కరి వద్ద రూ.2000 లంచం తీసుకొని వారి పేర్లు మాత్రమే ఆన్ లైన్ లో నమోదు చేశారని తేలింది. ఇదేమని ప్రశ్నించిన వైసీపీ నాయకుడితో అసభ్యంగా మాట్లాడారు. ప్రశ్నించిన వారిపై సచివాలయ ఉద్యోగులు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఎమ్మెల్యే దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామని వైసీపీ నేతలు సదురు సచివాలయ సిబ్బందిని హెచ్చరించినా జగన్ కైనా చెప్పుకో అంటూ వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని వైసీపీ నేతలు వాపోయారు. దీంతో ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.