Begin typing your search above and press return to search.
పాల్ వచ్చారు.....నవ్వులే నవ్వులే
By: Tupaki Desk | 21 Nov 2018 4:08 AMఎన్నికలంటే యుద్దమే....ఇతర దేశాల సంగతి ఎలా ఉన్న భారత దేశంలో మాత్రం ఎన్నికలంటే రణరంగమే. విమర్శలు - ఆరోపణలు - తిట్టుకోవాడాలు - టిక్కెట్టు రాలేదని ఏడవడాలు - కోపాలు - నిరసనలు - అలకలు - బెదరింపులు - బుజ్జగింపులు ఇవ్వన్ని సర్వసాధరణం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయి విజయం ఎవరిదో తేలే వరకు అంత సీరియస్. ప్రజలు కూడా ఇలాంటి వాతవరణాలనికి అలవాటు పడిపోయారు. మధ్యలో కాసింత బోర్ కొట్టిన ఏంటిరా ఈ ప్రచారాలు అంటూ విసుక్కున్న చేసేదేమి లేక మిన్నకుండిపోతారు. అయితే తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలకు మాత్రం హఠాత్తుగా నవ్వుల పువ్వులు పూస్తున్నాయి. వెండి తెరపై సీరియస్ గా సాగుతున్న కథలో హఠత్తుగా బ్రహ్మాంనందం ఎదురైతే ప్రేక్షకులకు ఎంత రిలీఫ్ ఉంటుందో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అంతే రిలీఫ్ కలుగుతోంది. దీనికి కారణం కె.ఎ. పాల్.
కె.ఎ. పాల్ క్రైస్తవ మత గురువు. దాదాపు ప్రపంచంతోని అన్ని దేశాలను చుట్టి వచ్చిన క్రైస్తవ అధ్యాత్మిక వేత్త. హఠాత్తుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజా శాంతి పేరుతో రాజకీయ పార్టీ కూడా పెట్టారు. నిన్నటి వరకూ సీరియస్ గా ఉన్న తెలంగాణ ఎన్నికల తెరపైకి నేను ఉన్నానంటూ కె.ఎ. పాల్ రంగ ప్రవేశం చేసారు. ఇక చెప్పేదేముంది సీరియస్ ఎన్నికలలో కామేడి ఘట్టం ప్రారంభం అయ్యింది. తొలి సీన్ లోనే కె.ఎ. పాల్ తన రాజకీయ హస్యాన్ని అధ్భుతంగా పండించారు. ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన వల్లే గెలిచాడని ప్రకటించారు. తనతో ఇప్పటికి టచ్ లో ఉంటాడని వారిద్దరు ట్విట్టర్ లో నిరంతరం సంభాషించుకుంటామని కామేడిని పండించారు. ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు తాను అధ్యాత్మిక గురువునని - నిజానికి ట్రంప్ ఇప్పటికీ తన మాట కాదనడని అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబందించి మాట్లాడుతూ తన పార్టీ ప్రజా శాంతి రెండు తెలుగు రాష్ట్రా లలో పోటి చేస్తుంది అని ఆయన అన్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది, ఇప్పుడు కె.ఎ. పాల్ పార్టీ ప్రజాశాంతి ఎన్నికల బరిలో ఎలా ఉంటుందని - తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. నామినేషన్లు పూర్తైన ఎన్నికలలో పోటి చేస్తామని ప్రకటించడమే కె.ఎ. పాల్ కామేడి. ఆంధ్రప్రదేశ్ లో అయితే 2019లో ఎన్నికలు జరుగుతాయి. అక్కడ తాము పోటి చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటామని కె.ఎ. పాల్ ప్రకటించడం రాజకీయ కామేడికి పరాకాష్ట. మనిషన్నాక కాసింత కళపోషన ఉండాలని అప్పుడెప్పుడో రావు గోపాలరావు అన్నారు. ఆయన అన్నట్లు గానే రాజకీయాలన్నాక కె.ఎ. పాల్ లాంటి కమేడియన్లు ఉండాలి.