Begin typing your search above and press return to search.
విచారణలో పెద్దలు..డోపింగ్ మిషన్ తో దర్యాప్తు
By: Tupaki Desk | 25 July 2017 4:20 PM GMTహైదరాబాద్ లో కలకలం రేకెత్తిస్తున్న డ్రగ్స్ మాఫియాపలో కొత్త కోణం బయటపడింది. దర్యాప్తును మరింత లోతుగా చేసేందుకు డోపింగ్ మిషన్లను ప్రవేశపెట్టారు. ఈ పరిణామం కలకలం రేకెత్తించింది. ప్రముఖ వ్యాపారవేత్తల భాగస్వామ్యం ఉన్నట్లు తేలడంతో ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. బానోతు సౌరభ్ - ఆకుల రితికేష్ - అంకిత్ అగర్వాల్ అనే ముగ్గురు వ్యాపారులను సిట్ విచారించిన క్రమంలో మరికొందరి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ విచారణ సందర్భంగా గత రెండేళ్లుగా తాము డ్రగ్స్ వాడుతున్నామని ముగ్గురు వ్యాపారులు ఒప్పుకొన్నారు. తాజా రాకెట్‌లో కీలక వ్యక్తి అయిన కెల్విన్ నుంచే తాము డ్రగ్స్ పొందినట్లు వారు వివరించారు. తమతో పాటు మరికొందరు సైతం ఉన్నారని వారు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా...డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా విచారణ ముగిసింది. దాదాపు 4 గంటలపాటు సిట్ అధికారులు చిన్నాని విచారించినట్టు తెలుస్తుంది. పలు కోణాలలో సిట్ అధికారులు చిన్నాని విచారించినట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు విచారించిన వారి కన్నా చిన్నా విచారణనే అధికారులు చాలా తొందరగా ముగించారని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం 10 గంటల కు ఎక్సైజ్ కార్యాలయంలో చిన్నా విచారణ ప్రారంభం అయిన సంగతి తెలిపిందు. నిన్న నటుడు నవదీప్ ను సిట్ అధికారులు రాత్రి 9.45 వరకు విచారించారు.
డ్రగ్స్ కేసులో చార్మి హైకోర్టుకు అనవసరంగా వెళ్లిందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ - డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. సచివాలయంలో మీడియాతో చంద్రవదన్ - అకున్ సబర్వాల్ చిట్ చాట్ చేసిన సందర్భంగా.. చార్మి నుంచి వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే పిలిచామని తెలిపారు. చార్మిని తాము నిందితురాలు అనలేదని స్పష్టం చేశారు. కోర్టుకు వెళ్లి.. పరోక్షంగా చార్మి నిందితురాలని తానే ఒప్పుకున్నట్టుగా ఉందన్నారు. సిట్ విచారణకు హాజరయ్యే వారిని నిందితులు అనడం లేదని స్పష్టం చేశారు అకున్ - చంద్రవదన్. విచారణ మొత్తం రికార్డు అవుతుందన్నారు. విచారణకు వచ్చే వారు అలోవెరా డ్రింక్ తాగి కడుపు క్లీన్ చేసుకుని వస్తున్నారని వెల్లడించారు. విచారణలో కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి.. పెద్ద హీరోలు - నిర్మాతల పేర్లు చెబుతున్నారని తెలిపారు. ఆధారాలు లేకుండా అందరికీ నోటీసులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. నార్కోటిక్ తో పాటు ఢిల్లీ నుంచి అథ్లెటిక్ డోప్ టెస్టింగ్ మిషన్ తెచ్చి పరీక్ష చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నామన్న వారు.. ఇంటెలిజెన్స్ కూడా డ్రగ్స్ పై పూర్తి నిఘా పెట్టిందన్నారు.