Begin typing your search above and press return to search.

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటాం.. కావాలంటే లెక్క‌లు చూస్కోండిః ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   13 Feb 2021 8:30 AM GMT
పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటాం.. కావాలంటే లెక్క‌లు చూస్కోండిః ప‌వ‌న్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రిగిన తొలి విడ‌త పంచాయతీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్టింద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ వెల్ల‌డించారు. ఈ పోలింగ్ లో త‌మ‌కు 18 శాతం ఓట్లు వ‌చ్చాయ‌ని తెలిపారు ప‌వ‌న్‌. తొలిదశ ఎన్నికల ఫలితాలను పూర్తిస్థాయిలో విశ్లేషిస్తే ఈ విష‌యం తేలింద‌న్నారు జ‌న‌సేనాని. త‌మ పార్టీ మ‌ద్ద‌తుతో పోటీ చేసిన వారు సాధించిన ఫ‌లితాల‌ను ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

జ‌న‌సేన పార్టీ మద్దతుతో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచిన వారిలో 1000కిపైగా వార్డుల‌లో గెలిచారని తెలిపారు. అదేవిధంగా దాదాపు 1700 పంచాయ‌తీల్లో త‌మ అభ్య‌ర్తులు రెండోస్ధానంలో నిలిచినట్లు చెప్పుకొచ్చారు. ఈ రిజ‌ల్ట్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకతను చాటుతున్నాయ‌న్న ప‌వ‌న్‌.. జనాల్లో మార్పు మొదలైందనడానికి ఈ ఫ‌లితాలే నిదర్శన‌మని అన్నారు.

అయితే.. ఇక్కడ ఒక ఆస‌క్తిక‌ర అంశం ఉంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మిత్రపక్షం బీజేపీతో క‌లిసి పోటీచేసింది జ‌న‌సేన‌. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ పార్టీ ప్ర‌గ‌తిని, సాధించిన ఫ‌లితాల‌ను మాత్ర‌మే వెల్ల‌డించ‌డం విశేషం. దీంతో.. కూట‌మి ఫ‌లితాల‌ను ఎందుకు వెల్ల‌డించ‌లేదు? అనే చ‌ర్చ కొన‌సాగుతోంది.