Begin typing your search above and press return to search.

తొలి త్రివిధ దళాధిపతి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   1 Jan 2020 10:54 AM GMT
తొలి త్రివిధ దళాధిపతి సంచలన వ్యాఖ్యలు
X
దేశం ఒకే సైన్యాధికారి చేతిలో ఉంటే నియంత పాలనలోకి పోతుందని స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో నాటి కాంగ్రెస్ ప్రధానులు దేశ రక్షణ వ్యవస్థను మూడు భాగాలుగా విభజించారు. పక్కనున్న పాకిస్తాన్ లో ఆర్మీ జనరల్ ముషారఫ్ ప్రజాస్వామ్యాన్ని కూలదోసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు అక్కడ ఆర్మీ దురాక్రమణ సాగి నియంత రాజ్యంనడించింది. అందుకే భారత దేశంలో నాటి ప్రధానులు ఆర్మీ, వాయు, నౌకదళ సేనలుగా విభజించి మూడింటికి ముగ్గురు అధిపతులను ఏర్పాటు చేశారు.

అయితే దీని వల్ల యుద్ధ సమయం లో కమ్యూనికేషన్ వ్యవస్థ మూడు దళాలకు సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే మోడీ సర్కారు తాజాగా ఆర్మీ, వాయు,నౌకదళాలను ఏకం చేసింది. ఈ సేనలన్నింటికి కలిపి దేశ తొలి త్రివిధ దళాధిపతి (సీడీఎస్)గా ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ నియామకం అయ్యారు.ఈ కోవలోనే ఈయన స్థానంలో ఆర్మీ సైన్యాధిపతిగా మనోజ్ ముకుంద్ నరవాణే ను నియమించారు.

తాజాగా తొలి త్రివిధ దళాధిపతి(సీడీఎస్)గా నియామకమైన బిపిన్ రావత్ సైన్యం, వాయుసేన, నౌకదళ అధిపతులతోపాటు పలువురు సీనియర్ అధికారులతో కలిసి ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము రాజకీయాలకు దూరంగా ఉంటామని.. ఎవరూ అధికారంలో ఉన్నా వారి సూచనల ప్రకారం పనిచేస్తామని తెలిపారు. మూడు దళాలు మరింత సమన్వయంతో పనిచేసేలా కృషి చేయనున్నట్టు తెలిపారు.