Begin typing your search above and press return to search.

ఇప్పుడున్న వేళలో అలా సెక్సు చేస్తే నో ప్రాబ్లమట

By:  Tupaki Desk   |   13 May 2020 2:30 PM GMT
ఇప్పుడున్న వేళలో అలా సెక్సు చేస్తే నో ప్రాబ్లమట
X
ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయమిది. ప్రపంచం ఇంతకు ముందెప్పుడు ఎదురుకాని విచిత్రమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఇలాంటివేళ.. ప్రతి విషయంలోనూ ఎన్నో సందేహాలు.. మరెన్నో సమస్యలు. ఇవన్ని ఒక ఎత్తు అయితే.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో శృంగారం చేయటం కూడా రిస్కేనా? అన్న క్వశ్చన్ పలువురిలో వ్యక్తమవుతోంది. ఎవరికి వారు ఇళ్లల్లో ఉన్నా.. ఏదో ఒక అవసరానికి బయటకు వెళ్లని తప్పని పరిస్థితి. ఇలాంటప్పుడు జీవిత భాగస్వామ్యులతో జరిపే రొమాన్సు.. రిస్కీ అవుతుందా? అన్న సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది.

ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో శృంగారం చేసేందుకు కొన్ని పద్దతులు ఉన్నట్లుగా చెబుతున్నారు. జీవిత భాగస్వామితో తప్పించి.. ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో శృంగారం చేయటం ఏ మాత్రం మంచిది కాదు. మాయదారి రోగ లక్షణాలు ఏ మాత్రం కనిపించినా.. భౌతిక దూరాన్ని పాటించటం తప్పనిసరి. అందుకు భిన్నంగా ఎలాంటి లక్షణాలు లేకుంటే.. నిరభ్యంతరంగా రొమాన్సు చేసుకోవచ్చు.

జీవిత భాగస్వామి జ్వరంతో ఇబ్బంది పడుతున్న వేళ.. అదెలాంటిదైనా శృంగారంకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆరోగ్యం బాగోలేకుంటే.. వేర్వేరు గదుల్లో నిద్రపోవటం చాలా మంచిది. ప్రస్తుతం విస్తరిస్తున్న మాయదారి రోగం చాలా వరకూ ఇళ్లల్లో వ్యాపిస్తున్న వైనాలే ఎక్కువగా చెబుతున్నారు.
ముద్దులు పెట్టుకోవటం.. శృంగారం చేయటం ద్వారా.. ఇంట్లోని ఒకరి నుంచి మరొకరికి కూడా మాయదారి వ్యాధి అంటుతోందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రొమాన్సు చేసేటప్పుడు కండోమ్ ఉపయోగించటం మేలన్నది మర్చిపోకూడదు. ఇతర ప్రాంతాల్లో ఉండి ఇంటికి వచ్చిన జీవిత భాగస్వామి తో వెంటనే శృంగారం చేసే కన్నా.. కాసిన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే మంచిది.