Begin typing your search above and press return to search.

ఆ విషయంలోనూ దరిద్రపుగొట్టు ర్యాంకు మనకే సొంతం

By:  Tupaki Desk   |   13 Sep 2021 5:48 AM GMT
ఆ విషయంలోనూ దరిద్రపుగొట్టు ర్యాంకు మనకే సొంతం
X
రానున్న రోజుల్లో కాబోయే సూపర్ పవర్ గా మనకు మనం గొప్పలు చెప్పుకోగానే సరిపోదు. అంతకంటే ముందు.. మనం మారాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. ఆ కోవలోకే వస్తుంది ‘సోషల్ బిహేవియర్’. ఏమిటిది అంటారా? రోడ్డు మీద వెళుతున్నప్పుడు మనం తిన్న చాక్లెట్ రేపర్ మొదలు కొని.. చెత్తను చెత్త కుండీలో కాకుండా ఇష్టారాజ్యంగా బయటపడేయటం ఉంటుంది చూశారా? అవన్నీ సోషల్ బిహేవియర్ ఖాతాలోకే వస్తాయి. ట్రైన్ లో వెళుతున్న వేళలో.. వాష్ బేసిన దగ్గరకు వెళ్లి చేతులు కడుక్కోవటానికి బదులుగా.. కూర్చున్న సీటు పక్కనే ఉన్న కిటికీలో నుంచి చేతులు కడుక్కోవటం.. ఆ నీళ్లు కాస్తా.. వెనుకున్న వారి ముఖం మీద పడటం లాంటి చేదు అనుభవాలు మనలో ఎంతోమంది అనుభవించి ఉంటారు.

ఇలాంటి తీరు సోషల్ బిహేవియర్ కిందకే వస్తుంది. అంటే.. బాధ్యత లేకుండా ఒకరు చేసే పనుల కారణంగా.. మిగిలిన వారంతా ఇబ్బందులకు గురి కావటమన్నమాట. దీన్ని మరో మాటలో చెప్పాలంటే సోషల్ మైండ్ ఫుల్ నెస్ గా చెప్పొచ్చు. తాజాగా ఒక సంస్థ ఈ తీరు ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లోని ప్రజలకు ఎంత మేర ఉందన్న విషయంపై అధ్యయనం నిర్వహించారు. ఈ తరమా బిహేవియర్ విషయంలో మన ర్యాంక్ మరింత చెత్తగా ఉందని చెప్పక తప్పదు.

మొత్తం 65 మంది అంతర్జాతీయ పరిశోధకులతో ఏర్పడిన టీం వివిధ దేశాల్లోని 8354 మందిపై ఈ సర్వేను నిర్వహించారు. సోషల్ మైండ్ నెస్ లో వివిధ దేశాలకు చెందిన ప్రజలు భిన్నంగా ప్రవర్తిస్తారన్న విషయాన్ని గుర్తించారు. రోజువారీ జీవితంలో అనేక సందర్భాల్లో ఇతరులకు సాయం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకున్నా.. కాస్తంత బాధ్యతగా వ్యవహరిస్తే సరిపోతుంది.

ఈ విషయంలో మనకు దక్కింది కేవలం 50 మార్కులు మాత్రమే. ఈ విషయంలో అత్యుత్తమ ర్యాంకులో జపాన్ అగ్రస్థానంలో నిలిస్తే.. తర్వాతిస్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. జపాన్ కు 72 శాతం స్కోరింగ్ రాగా.. ఆస్ట్రేలియాకు 69 శాతం స్కోరింగ్ వచ్చింది.

మూడో స్థానంలో మెక్సికో 68 శాతం మార్కులు రాగా.. బ్రిటన్ కు 64 శాతం.. చైనా 62 స్థానం మార్కులు వచ్చాయి. అనూహ్యంగా ఈ విషయంలో ప్రపంచానికి పెద్దన్నగా పేరున్న అమెరికాకు కేవలం 58 శాతం మార్కులే రావటం గమనార్హం. ముందే చెప్పినట్లు భారత్ కు 50 శాతం మార్కులు రాగా.. అతి తక్కువ మార్కులు వచ్చిన దేశంగా ఇండోనేషియా నిలిచింది. ఆ దేశంతో పోలిస్తే.. టర్కీ కాస్త మెరుగ్గా 47 శాతం మార్కులతో ఉంది. అన్ని అంశాల్లో ముందుకు దూసుకెళ్లాలని తపించే భారతీయులు.. సోషల్ మైండ్ ఫుల్ నెస్ విషయంలోనూ మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.