Begin typing your search above and press return to search.
కొత్త సంవత్సరంలోకి వచ్చేశాం.. వీటిల్లో అప్డేట్ కావాలి బాస్
By: Tupaki Desk | 1 Jan 2021 1:30 PM GMTకొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కరోనాతో యావత్ ప్రపంచం విలవిలలాడిన 2020కు గుడ్ బై చెప్పేసి.. కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. ఇదంతా బాగానే ఉన్నా.. కొత్త సంవత్సరం తొలి రోజు నుంచే కొన్ని విషయాల్లో ప్రభుత్వం కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. రోజువారీ జీవితాన్నిప్రభావితం చేసే ఈ అంశాల్లో అప్డేట్ కాకుంటే ఇబ్బందులు తప్పవు అవేమంటే..
- చెక్కు చెల్లింపులకు ఈ రోజు (జనవరి 1) నుంచి కొత్త చెల్లింపుల విధానం వచ్చింది. పాజిటివ్ పేమెంట్ సిస్టం విధానంలో రూ.50వేలు.. అంతకు మించిన చెల్లింపులు చేస్తుంటే.. ఖాతాదారులు కొన్ని కీలక విషయాల్ని రెండుసార్లు ద్రువీకరించాల్సి ఉంటుంది. చెక్ ల ద్వారా జరిగే మోసాలకు చెక్ పెట్టే పనిలో భాగంగా ఆర్ బీఐ కొత్తవిధానాన్ని తీసుకొచ్చింది. రూ.50వేల నుంచి రూ.5లక్షల లోపు వరకు చెక్కులకు మాత్రం ఈ విధానాన్ని ఫాలో కావాలా? వద్దా?అన్నది ఖాతాదారులు డిసైడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
- డెబిట్.. క్రెడిట్ కార్డుల ద్వారా కాంటాక్టు లెస్ కార్డు లావాదేవీల పరిమితి ఇప్పటివరకు రూ.2వేలు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.5వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త విధానం ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చింది. సో..కాంటాక్టు లెస్ కార్డు లావాదేవీలు మరింత ఊపందుకోవటానికి అవకాశం ఉంది. కొత్త విధానంలో పిన్ అవసరం లేకుండానే చెల్లింపులు జరపొచ్చు.
- ఎక్కువమందిని జీవిత బీమా పరిధిలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో సరళ్ జీవన్ బీమా పాలసీని తీసుకొచ్చారు. ఇందులో ఆదాయాన్ని పరిగణలోకితీసుకోకుండా రూ.5లక్షల నుంచి రూ.25 లక్షల వరకుబీమా చేసుకునే వెసులుబాటు కల్పించారు. టర్మ్ పాలసీ కావటంతో తక్కువ ప్రీమియం ఉంటుంది. ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే 20 శాతం రాయితీ కూడా లభిస్తుంది.
- ఈ రోజు నుంచి ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్లకు ఫోన్ చేయాలంటే సదరు నెంబరు ముందు సున్నాను తప్పనిసరిగా చేర్చాల్సిందే.
- ఈ రోజు నుంచి జీఎస్టీ రిటర్న్ ల ఫైలింగ్లో చిన్న వ్యాపారులకు పెద్ద ఊరట ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఏడాదిలో 12 రిటర్న్ లు ఫైల్ చేయాల్సి ఉండగా.. ఇకపై నాలుగు జీఎస్టీ రిటర్న్ లు ఫైల్ చేస్తే సరిపోతుంది.