Begin typing your search above and press return to search.
ఇక ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం మనదే!
By: Tupaki Desk | 19 April 2023 2:57 PM GMTప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు అత్యధిక జనాభా గల దేశంగా చైనా ఉంది. ఇప్పుడు దీన్ని భారత్ అధిగమించిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మనదేశంలో చైనా కంటే 29 లక్షల మంది అధికంగా ఉన్నారని పేర్కొంది. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 19న విడుదల చేసింది. 1950లో తొలిసారిగా ఐక్యరాజ్యసమితి జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది ఇప్పుడే.
జనాభా అంచనాలకు సంబంధించి 'స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు–2023' పేరుతో ఐక్యరాజ్యసమితి తాజా నివేదికను విడుదల చేసింది. ఈ క్రమంలో భారత్ లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు తెలిపింది. మనతో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లుగా ఉందని అంచనా వేసింది.
ఇక ప్రపంచంలో జనాభా పరంగా అమెరికా మూడో స్థానంలో నిలిచింది. అమెరికాలో 34 కోట్ల మంది జనాభా ఉన్నారని యూఎన్‌వో అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించింది.
ఇక ప్రపంచ జనాభా 804.5 కోట్లుగా ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అందులో మూడింట ఒకటో వంతు జనాభా కేవలం భారత్, చైనాల్లోనే ఉంది. కుటుంబ నియంత్రణ చర్యలతో కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గిపోయింది.
ఇక భారత్ లోనూ కుటుంబ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమేరకు జనాభా పెరిగింది. 2011 నుంచి భారత జనాభాలో సరాసరి 1.2 శాతం పెరుగుతూ వస్తోంది. 2011కు ముందు పదేళ్లు మాత్రం ఈ పెరుగుదల 1.7శాతంగా ఉండటం గమనార్హం.
కాగా భారత్ లో 2011లో జనగణన జరిగింది. తిరిగి 2021లో వాటిని చేపట్టాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ ఎప్పుడు అవతరించిందో ఖచ్చితమైన తేదీని ఐక్యరాజ్యసమితి చెప్పలేకపోతోంది.