Begin typing your search above and press return to search.

ప్రపంచంలో అత్యుత్తమ 100 బ్రాండ్ల లో మనది ఒకే ఒక్కటి

By:  Tupaki Desk   |   8 Jun 2023 10:03 AM GMT
ప్రపంచంలో అత్యుత్తమ 100 బ్రాండ్ల లో మనది ఒకే ఒక్కటి
X
ప్రపంచంలో అత్యత్తుమ బ్రాండ్లకు సంబంధించిన తాజా నివేదిక విడుదలైంది. దీని ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ టాప్100 బ్రాండ్లలో భారత్ కు చెందిన ఒకే ఒక్క బ్రాండ్ కు చోటు లభించటం గమనార్హం. భారత్ లో అత్యుత్తమ బ్రాండ్ గా పేరున్న టాటా గ్రూప్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ గ్రూప్ బ్రాండ్ విలువ 2022తో పోలిస్తే 10.3 శాతం పెరిగింది. దీని ప్రకారం దీని విలువ మన రూపాయిల్లో రూ.2.16 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. 25 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన ఏకైక భారతీయ బ్రాండ్ గా టాటా గ్రూప్ అవతరించింది.

తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం టాప్ 100లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ బ్రాండ్ టాటా గ్రూప్ మాత్రమే. తర్వాతి స్థానంలో ఇన్ఫోసిస్.. మూడో స్థానంలో ఎల్ఐసీ.. నాలుగోస్థానంలో ఎయిర్ టెల్ నిలిచింది. రిలయన్స్ గ్రూప్ ఐదో స్థానంలో నిలిస్తే.. ఇదే గ్రూప్ నకు చెందిన జియో మాత్రం 11వ స్థానానికే పరిమితమైంది. ఆరో స్థానంలో ఎస్ బీఐ, ఏడో స్థానంలో మహీంద్రాగ్రూప్.. ఎనిమిదో స్థానంలో విప్రో.. తొమ్మిదోస్థానంలో హెచ్ డీఎఫ్ సీ.. పదోస్థానంలో హెచ్ సీఎల్ టెక్ బ్రాండ్లు నిలిచాయి.

బ్యాంకుల్లో ఎస్ బీఐ అగ్రస్థానంలో ఉంటే.. తర్వాతి స్థానంలో హెచ్ డీఎఫ్ సీ.. ఐసీఐసీఐ లు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గతానికిభిన్నంగా మహీంద్రా గ్రూప్ 17 శాతం విలువను పెంచుకొని 7వ స్థానానికి చేరుకుంది. ఇదేగ్రూప్ నకు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా 53.8 శాతం పెరిగి3.6 బిలియన్ డాలర్లకు బ్రాండ్ విలువను పెంచుకున్నట్లుగా నివేదిక వెల్లడించింది.

భారత్ లో అత్యంత వేగవంతమైన ఆటో మొబైల్ బ్రాండ్ గా అంతర్జాతీయంగా అత్యంత వేగంగా టాప్ 10 ఆటోమొబైల్ బ్రాండ్ గా మహీంద్రా నిలిచింది. మహీంద్రాతో పాటు టాటా మోటార్స్.. మారుతీ కూడా విలువ విషయంలో రెండెంకల వ్రద్ధిరేటును సాధించాయి. దుస్తుల బ్రాండ్లో రేమండ్ అత్యంత విలువైన బ్రాండ్ గా నిలిచింది. ఇక.. విమానయాన బ్రాండ్ విభాగంలో ఇండిగో నిలిచింది. ఈ బ్రాండ్ విలువ 832 మిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు.